ఆర్ ఆర్ ఆర్ మూవీ షూటింగ్ లేటవడం మహేష్ ఫ్యాన్స్ ని ఇబ్బంది పెడుతుంది. దాని వలన మహేష్-రాజమౌళి ప్రాజెక్ట్ లేటవుతుందని వారు భావిస్తున్నారు. కరోనా వైరస్ కారణంగా సినిమాల షూటింగ్ నిలిచిపోయింది. ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చినా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న నేపథ్యంలో ఎవరూ షూటింగ్స్ నిర్వహించడానికి ఇష్టపడడం లేదు. షూటింగ్స్ కారణంగా ముగ్గురు బుల్లితెర నటులు కరోనా వైరస్ భారిన పడ్డారు. దీనితో వందల మంది సిబ్బంది పాల్గొనే భారీ చిత్రాల చిత్రీకరణ మరింత ప్రమాదకరం అని అందరూ భావిస్తున్నారు.
ఇక ఆర్ ఆర్ ఆర్ కోసం ఇప్పటికే ఓ భారీ సెట్ నిర్మించడం జరిగింది. ఐతే షూటింగ్ మొదలుకాకపోవడానికి కారణం కరోనా వైరస్ వ్యాప్తి. రాజమౌళి సిద్ధంగా ఉన్న ఎన్టీఆర్, చరణ్ లతో పాటు కొందరు నటులు ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో పాల్గొనడానికి ఆసక్తి చూపడం లేదు. దీనితో ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ మరింత ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీనితో రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్ వెనక్కి వెళ్లేలా కనిపిస్తుంది. మహేష్ తో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్రకటించిన రాజమౌళి 2021లో సెట్స్ పైకి తీసుకెళ్లాలి అనుకున్నారు.
అన్నీ అనుకున్న ప్రకారం జరిగి ఆర్ ఆర్ ఆర్ 2021 జనవరిలో విడుదలైన పక్షంలో స్క్రిప్ట్ పని పూర్తి చేసి 2021 చివరికల్లా ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కించాలని రాజమౌళి భావించారు. కాగా ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ ఆలస్యం అయ్యే కొద్దీ మహేష్ ప్రాజెక్ట్ వెనక్కు వెళుతుంది. అందుకే మహేష్ ఫ్యాన్స్ దీనిపై అసహనంగా ఉన్నారట. వారు ఎప్పటినుండో ఎదురుచూస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తుంది.
Most Recommended Video
మన టాలీవుడ్ డైరెక్టర్లు లేడీ అవతారాలు ఎత్తితే ఇలానే ఉంటారేమో !!
చిరు ఫ్యాన్స్ ను నిరాశ పరిచిన సినిమాలు ఇవే..!
ఆ డైరెక్టర్లకు ఛాన్స్ ఇచ్చింది మన రవితేజనే..!
మన హీరోలు అందమైన అమ్మాయిలుగా మారితే ఇలాగే ఉంటారేమో!