Mahesh Babu: మహేష్ ను ట్రోల్ చేస్తున్న వాళ్లకు ఫ్యాన్స్ సమాధానమిదే!

  • September 17, 2022 / 12:09 PM IST

ప్రముఖ బుల్లితెర ఛానెళ్లలో ఒకటైన జీ తెలుగు ఛానెల్ మహేష్ బాబు తమ ఛానెల్ లోని కార్యక్రమాలను, సీరియళ్లను ప్రమోట్ చేసేలా మహేష్ బాబుతో ఒప్పందం కుదుర్చుకుంది. ఏకంగా 9 కోట్ల రూపాయలకు ఇందుకు సంబంధించి డీల్ కుదిరింది. అయితే సీరియళ్లకు సంబంధించిన ప్రోమోలలో మహేష్ బాబు కనిపించడం కొంతమందికి నచ్చడం లేదు. కొంతమంది మాత్రం ఈ విషయంలో మహేష్ ను ట్రోల్ చేస్తున్నారు. అయితే ట్రోల్ చేసిన వాళ్లకు మహేష్ బాబు అభిమానులు తనదైన శైలిలో సమాధానం ఇస్తున్నారు.

మహేష్ బాబు తను సంపాదించిన డబ్బులో ఎక్కువ మొత్తం సేవా కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తున్నాడని సీరియళ్లను, షోలను ప్రమోట్ చేయడంలో తప్పేం లేదని మహేష్ బాబు ఫ్యాన్స్ చెబుతున్నారు. మహేష్ నటించిన యాడ్స్ వల్ల గతంలో ప్రముఖ సంస్థల ఉత్పత్తుల సేల్స్ పెరిగాయని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది.

ఈ సినిమాకు మహేష్ బాబు 70 కోట్ల రూపాయల రెమ్యునరేశన్ + జీఎస్టీ తీసుకుంటున్నారని బోగట్టా. మహేష్ బాబు గత సినిమాల రెమ్యునరేషన్లతో పోల్చి చూస్తే ఈ మొత్తం ఎక్కువ మొత్తం కావడం గమనార్హం. సినిమాసినిమాకు మహేష్ బాబు రేంజ్ పెరుగుతుండగా ప్రాజెక్ట్ ల ఎంపికలో మహేష్ బాబు ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

మహేష్ బాబు తర్వాత సినిమా రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. మహేష్ రాజమౌళి కాంబో మూవీకి సంబంధించి చిన్న అప్ డేట్ వచ్చినా ఆ అప్ డేట్ సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. కెరీర్ విషయంలో మహేష్ బాబు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. మహేష్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లన్నీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus