Mahesh Babu, Rajamouli: హాలీవుడ్‌ హీరోయిన్లే కావాలట… రాజమౌళికి మహేష్‌ ఫ్యాన్స్‌ రిక్వెస్ట్‌లు

ఆలూ లేదు సూలూ లేదు.. కొడుకు పేరు సోమలింగం అనే ఓ నానుడి ఉంది మీకు తెలుసా? అంటే ఇంకా ప్రాథమికంగా జరగాల్సిన పనులే జరగలేదు. ఈలోపు ఆ తర్వాత చేయాల్సిన పనుల గురించి చర్చలు పెడితే ఈ మాట అంటూ ఉంటారు. ఇప్పుడు ఎందుకు అని అనుకుంటున్నారా? మహేష్‌బాబు  (Mahesh Babu) అభిమానులు అని చెప్పుకుంటున్న కొంతమంది నెటిజన్లు చేస్తున్న హడావుడి చూసి ఈ మాట అంటున్నారు మరికొంతమంది. ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) సినిమా తర్వాత మహేష్ బాబు చేయనున్న సినిమా (S. S. Rajamouli) రాజమౌళి ది.

#SSMB 29 అంటూ ఓ వర్కింగ్‌ టైటిల్‌ పెట్టుకుని చాలా రోజులుగా ఈ సినిమా కోసం పనులు జరుగుతున్నాయి. ఇదిగో, అదిగో అంటూ కొన్ని రోజులు ఊరించిన సినిమా టీమ్‌.. ఇప్పుడు పెద్దగా సప్పుడు చేయడం లేదు. చూస్తుంటే ఆగస్టు 9న కూడా ఎలాంటి అప్‌డేట్‌ లేకుండా ముందుకువెళ్లిపోయేలా ఉంది. ఆ విషయం వదిలేస్తే ఆ సినిమా కోసం హీరోయిన్లను ఇప్పటికే ఫ్యాన్స్‌ సెలక్ట్‌ చేసేసుకున్నారు. అవును, ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా రాజమౌళి అండ్‌ కో ను రిక్వెస్ట్‌ కూడా చేసేస్తున్నారు.

సినిమాలో కేథరిన్ లాంగ్‌ఫోర్డ్, జోసెఫిన్ లాంగ్‌ఫోర్డ్‌ను హీరోయిన్లుగా తీసుకోవాలని రాజమౌళిని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఆస్ట్రేలియాకి చెందిన ఈ ఇద్దరు ఇప్పటికే టీవీ సిరీసులు, సినిమాల ద్వారా క్రేజ్ తెచ్చుకున్నారు. అందంలో వీరికి వీరే పోటీ అన్నట్లుగా ఉంటారు కూడా. దీంతో ఈ ఇద్దరినీ తీసేసుకోండి మన హీరో పక్కన అదిరిపోతాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. దీంతో తెలుగు హీరోయిన్లు, ఇండియన్‌ హీరోలు ఉన్నారు కదా..

ఎందుకు ఇప్పుడు హాలీవుడ్‌ హీరోయిన్లు అంటూ ఓ చర్చ కూడా సాగుతోంది. అయితే రాజమౌళి కెరీర్‌లో అత్యంత భారీ చిత్రం కాబట్టి.. ఇలాంటి ఆలోచన కూడా ఆయన చేయొచ్చు అనే చర్చ కూడా నడుస్తోంది. మరి రాజమౌళి మనసులో ఏ హీరోయిన్‌లు ఉన్నారో? చూద్దాం ప్రీ ప్రొడక్షన్‌ అయితే ఏమన్నా క్లారిటీ వస్తుందేమో?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus