Mahesh Babu, Rajamouli: ‘మాకు ఎదురు చూపులు తప్పవా బ్రో’ అంటున్న మహేష్ ఫ్యాన్స్!

దర్శకధీరుడు రాజమౌళి సినిమా అంటే సంవత్సరాల తరబడి టైం పడుతుంది. ప్రతి ఫ్రేమ్, షాట్ ని తను అనుకున్నట్టుగా పర్ఫెక్ట్ గా వచ్చే వరకు వన్ మోర్ అంటూ మళ్లీ మళ్లీ తీసిందే తీస్తూ.. ఒక్కో షాట్ ని శిల్పంలా చెక్కుతూ ఉంటారు కాబట్టే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆయనకి జక్కన్న అని పేరు పెట్టారు. ‘బాహుబలి’ సిరీస్, ట్రిపులార్ తో తెలుగు సినిమా స్థాయిని పెంచిన రాజమౌళి తన తర్వాత చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబుతో చెయ్యబోతున్న సంగతి తెలిసిందే.

సాధారణంగా ప్రీ ప్రొడక్షన్ కి కూడా ఎక్కువ టైం తీసుకుంటుంటారు జక్కన్న. అందుకే ఈ గ్యాప్ లో త్రివిక్రమ్ సినిమాకి షిఫ్ట్ అయిపోయారు సూపర్ స్టార్.. వీలైనంత త్వరగా ఆ సినిమా పూర్తి చేసేసి.. ఇక ఎన్నేళ్లు కావాలో తీసుకోండి అన్నట్టు రాజమౌళి అడిగినన్ని డేట్స్ ఇవ్వడానికి రెడీ అయిపోవాలని చూస్తున్నారు మహేష్. రాజమౌళి ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి అది థియేటర్లలోకి వచ్చేటప్పటికి మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ ఏ రేంజ్ లో వార్తలు, గాసిప్స్ వైరల్ అవుతాయో చూశాం.

ఇప్పటికీ ’బాహుబలి’ 2 పార్ట్స్ గురించి, ట్రిపులార్ గురించి వచ్చిన గాసిప్స్, మీమ్స్ చూస్తే నవ్వాగదు. జనాలే కాదు అవి చూసి ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్ లో చరణ్, తారక్, జక్కన్న ఎంతలా ఎంజాయ్ చేశారో తెలిసిందే. ఇప్పుడు మహేష్ తో చెయ్యబోయే సినిమా గురించి కూడా రీసెంట్ గా కొన్ని రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. అవేంటంటే.. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా.. జంగిల్ బేస్డ్ అడ్వెంచర్ మూవీగా.. ఆఫ్రికన్ ఫార్టెస్ట్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీని తెరకెక్కించనున్నారట.

2023 ఏప్రిల్ లో షూటింగ్ స్టార్ట్ చేసి 2025 చివర్లో విడుదల చెయ్యాలనే ప్లాన్ లో ఉన్నారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ‘‘త్రివిక్రమ్ మూవీ వచ్చే సమ్మర్ లో రిలీజ్ అవుతుంది.. రాజమౌళి సినిమా 2025 చివర్లో అంటే ఎటు తిరిగి రెండేళ్ల పాటు మా అభిమాన హీరోని స్క్రీన్ మీద చూడ్డం కుదరదన్న మాట.. ప్చ్.. ఏం చేస్తాం.. టైం తీసుకున్నా సాలిడ్ సినిమా ఇస్తాడులే జక్కన్న’’ అని సరిపెట్టుకుంటున్నారు మహేష్ ఫ్యాన్స్.. ట్రిపులార్ ప్రమోషన్స్ కోసం జపాన్ వెళ్లిన జక్కన్న తిరిగి వచ్చాక మహేష్ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేస్తారట..

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus