Mahesh Babu: బూతులతో ప్రముఖ న్యూస్ ఛానల్ పై రెచ్చిపోయిన మహేష్ ఫ్యాన్స్.. దిగొచ్చిన న్యూస్ ఛానల్?

సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఆయన నటించిన సర్కార్ వారి పాట సినిమా గురించి కొందరు ఉద్దేశపూర్వకంగా నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. సర్కారీ వారి పాట సినిమా ఈ నెల 12వ తేదీ విడుదలై మొదటి నుంచి పాజిటివ్ టాక్ సంపాదించుకున్నప్పటికీ కొందరు ఈ సినిమా గురించి నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ న్యూస్ ఛానల్ సైతం మహేష్ బాబు సినిమా గురించి నెగిటివ్ రివ్యూ ఇచ్చారు.

ఈ విధంగా న్యూస్ ఛానల్ మహేష్ బాబు సినిమా గురించి నెగిటివ్ రివ్యూ ఇవ్వడంతో మహేష్ బాబు అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ట్విట్టర్ వేదికగా సదరు న్యూస్ ఛానల్ పై బూతులతో విరుచుకుపడ్డారు. ఈ విధంగా మహేష్ అభిమానులు తీవ్ర స్థాయిలో బూతులతో సదరు న్యూస్ ఛానల్ ను ట్రోల్ చేయడంతో దెబ్బకు న్యూస్ ఛానల్ దిగొచ్చింది. అప్పటివరకు మహేష్ బాబు సినిమా గురించి నెగిటివ్ రివ్యూ ఇచ్చిన న్యూస్ ఛానల్ వెంటనే తన సినిమాకు పాజిటివ్ రివ్యూలు ఇచ్చారు.

ఇలా మహేష్ బాబు సినిమాకు పాజిటివ్ రివ్యూలు ఇచ్చినప్పటికీ అభిమానులు మాత్రం వెనక్కి తగ్గకుండా బహిరంగంగా తమ హీరోకి క్షమాపణలు చెప్పాలి అంటూ డిమాండ్ చేశారు. ఇలా మహేష్ బాబు అభిమానుల దెబ్బకు సదరు న్యూస్ ఛానల్ వెనకడుగు వేసింది. మహేష్ బాబు నటించిన సర్కారీ వారి పాట సినిమా మంచి విజయాన్ని అందుకొని అద్భుతమైన కలెక్షన్లతో దూసుకుపోతుంది.ఈ నేపథ్యంలో కొందరు ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ సినిమా విడుదలై మూడు రోజులు అయినప్పటికీ ఏకంగా 112 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించి మరో రికార్డును సృష్టించింది. ఇలా ఎంతో అద్భుతమైన సినిమాకు ఇలాంటి రివ్యూలు ఇవ్వడంతో అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహేష్ బాబు 26 సినిమాలు.. మరియు వాటి బాక్సాఫీస్ కలెక్షన్లు..!
‘భద్ర’ టు ‘అఖండ’.. బోయపాటి డైరెక్ట్ చేసిన సినిమాల కలెక్షన్లు..!
‘దూకుడు’ టు ‘సర్కారు వారి పాట’.. ఓవర్సీస్ లో మహేష్ బాబు 1 మిలియన్ మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus