Mahesh Babu, Sitara: సితారను మెచ్చుకున్న మహేష్ .. ఏం జరిగిందంటే?

సూపర్ స్టార్ మహేష్ బాబు గత మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు కాగా భవిష్యత్తు ప్రాజెక్ట్ లు కూడా సక్సెస్ సాధించే విధంగా మహేష్ కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. మహేష్ కూతురు సితార చాలా టాలెంటెడ్ అనే సంగతి తెలిసిందే. సర్కారు వారి పాట సినిమా నుంచి విడుదలైన పెన్నీ సాంగ్ లో సితార అద్భుతంగా డ్యాన్స్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సోషల్ మీడియాలో కూడా సితార యాక్టివ్ గా ఉంటారనే సంగతి తెలిసిందే.

అయితే ఈరోజు శ్రీరామనవమి పండుగ కాగా పండుగ సందర్భంగా సితార తొలిసారి కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించి ఆకట్టుకున్నారు. సితార కూచిపూడి నృత్యానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. తన కూతురు అద్భుతంగా డ్యాన్స్ చేయడంతో సూపర్ స్టార్ మహేష్ బాబు మురిసిపోయారు. సోషల్ మీడియాలో సితార డ్యాన్స్ వీడియోను పోస్ట్ చేయడంతో పాటు మహేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సితార తొలిసారి కూచిపూడి డ్యాన్స్ చేసిందని శ్రీరామనవమి పండుగ రోజున సితార కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించడంతో ఇంతకు మించి సంతోషం ఏముంటుందని మహేష్ బాబు అన్నారు.

సితార అంకిత భావం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని మహేష్ బాబు వెల్లడించారు. సితార ఇంత అద్భుతంగా డ్యాన్స్ చేయడానికి కారణమైన సితార గురువులు అరుణ, మహితకు ధన్యవాదాలు అని మహేష్ బాబు అన్నారు. సితారను మెచ్చుకుంటూ మహేష్ బాబు చేసిన కామెంట్లు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. పుత్రికోత్సాహంతో సూపర్ స్టార్ మహేష్ బాబు మురిసిపోయారు. మహేష్ తన ట్వీట్ ద్వారా అభిమానులకు, ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు.

మహేష్ నటించిన సర్కారు వారి పాట వచ్చే నెల 12వ తేదీన రిలీజ్ కానుంది. త్వరలో ఈ సినిమా నుంచి మరో పాట, ట్రైలర్ రిలీజ్ కానున్నాయని తెలుస్తోంది. మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంటారని ఫ్యాన్స్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus