Mahesh Babu: మహేష్ బాబు సినిమాల విషయంలో ఈ సెంటిమెంట్ ఫాలో అవుతారని తెలుసా?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు తన తదుపరి చిత్రాన్ని దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో బిజీ కానున్నారు ప్రస్తుతం సినిమాలో పరంగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంతో బిజీగా ఉన్నారు. ఇకపోతే మహేష్ బాబు ప్రస్తుతం నటిస్తున్నటువంటి ఈ సినిమా వచ్చేయడాది సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలకు సిద్ధమవుతుంది.

ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి మహేష్ బాబు సినిమాల విషయంలో ఒక సెంటిమెంట్ బీభత్సంగా నమ్ముతారట. గత కొంతకాలం నుంచి ఈ సెంటిమెంట్ ఫాలో అవుతూ వస్తున్నారని తెలుస్తుంది. సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీలకు ఇలాంటి సెంటిమెంట్లు ఎక్కువగా ఉంటాయనే సంగతి మనకు తెలిసిందే. ఇలా ఒక్కో సెలబ్రెటీ ఒక్కో విధమైనటువంటి సెంటిమెంట్ ఫాలో అవుతారు. అది ఫాలో అయితే తమ సినిమా హిట్ అవుతుందని నమ్ముతారు.

మరి మహేష్ బాబు (Mahesh Babu) తన సినిమాల విషయంలో ఎలాంటి సెంటిమెంట్లను నమ్ముతారనే విషయానికి వస్తే మహేష్ బాబు కొత్త సినిమా ప్రారంభిస్తున్నారు అంటే ఆ సినిమా పూజా కార్యక్రమాలకు ఈయన హాజరుకారట. ఇలా గత కొంతకాలం నుంచి మహేష్ బాబు తన కొత్త సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంటుంది అంటే ఆయన మాత్రం దరిదాపుల్లో ఉండరని తెలుస్తోంది. ఒక ఇంటర్వ్యూలో భాగంగా త్రివిక్రమ్ మహేష్ బాబు గురించి మాట్లాడుతూ మహేష్ ఒక సినిమాకు కమిట్ అయ్యారు.

పూజా కార్యక్రమాలలోనూ రాలేదు సినిమా స్టార్ట్ అయిన మూడు రోజులకు కూడా షూటింగ్ లొకేషన్లోకి అడుగుపెట్టలేదు దీంతో నాకు ఈయన సినిమాలో నటిస్తున్నారా లేదా అన్న సందేహం వచ్చిందని చెబుతూ ఉండగా ఇదే ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి సమంత సైతం దూకుడు సినిమా పూజా కార్యక్రమాలకు కూడా మహేష్ బాబు రాలేదు అంటూ చెప్పుకొచ్చారు. దీంతో అక్కడే ఉన్నటువంటి మహేష్ బాబు అది నా సెంటిమెంట్ అందుకే రాను అంటూ ఈ సందర్భంగా మహేష్ బాబు చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!

సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus