మహేష్ స్టెప్ గురించే చర్చ
- May 20, 2016 / 10:27 AM ISTByFilmy Focus
ఫ్యామిలీ సినిమాల డైరక్టర్ శ్రీకాంత్ అడ్డాల, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చిన బ్రహ్మోత్సవం సినిమా కంటే అందులో మహేష్ వేసిన స్టెప్ గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. బాల త్రిపురమని పాటలో మ్యూజిక్ బిట్ కి చేతులు, కాళ్ళూ ఊపుతూ చేసిన వామప్ లాంటి స్టెప్ ను చూసి అభిమానులు సైతం నవ్వుకుంటున్నారు. సూపర్ స్టార్ చేత ఆ స్టెప్ వేయించిన కొరియో గ్రాఫర్ ఫై తిట్ల దండకం అందుకుంటున్నారు.
మహేష్ స్టెప్ వీడియా నెట్లో వేగంగా షేర్ అవుతోంది. సరదాగా కామెంట్లు చేస్తున్నారు. “గుర్రపు వాతం స్టెప్ అద్భుతంగా వేసినందుకు.. నెస్ట్ ఫిలిం ఫేర్ అవార్డ్ లో బెస్ట్ డాన్సర్ అవార్డ్ మహేష్ కి వస్తుంది. “.. “మూర్చ వచ్చింది ఏమో చూడండి”.. “ఫిట్స్ వచ్చింది తాళాలు ఇవ్వండి”… “తండ్రికి తగ్గ తనయుడు”.. ” గ్రేట్ షివరింగ్ స్టెప్”.. ఆస్కార్ విన్నింగ్ స్టెప్ .. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
That evergreen step from #FlopUtsavam when u piss in pants pic.twitter.com/EhIVHoAmNT
— Twood Trolls™ (@TwoodTrolls) May 20, 2016

















