టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది ‘సర్కారు వారి పాట’ చిత్రంతో ప్రేక్షకులను అలరించాడు. ఈ మూవీ పూర్తయిన వెంటనే త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ మూవీ మొదలుపెట్టాడు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ వారు నిర్మాతలు. ఈ చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తయ్యి చాలా రోజులైంది. రెండో షెడ్యూల్ ఇంకా ప్రారంభం కాలేదు. మహేష్ తల్లి ఇందిరా దేవి గారు మరణించడం, ఆ తర్వాత మహేష్ విదేశాలకు వెళ్లి రావడం..
వంటి కారణాలతో ఇంకా సెకండ్ షెడ్యూల్ ప్రారంభం కాలేదు. అయితే ఈ గ్యాప్ లో మహేష్- త్రివిక్రమ్ ల మూవీ ఆగిపోయింది అంటూ రూమర్లు వినిపిస్తున్నాయి. నిర్మాత నాగవంశీ ఈ విషయంపై స్పందించినా ఈ రూమర్స్ మాత్రం ఆగడం లేదు. ఇదిలా ఉంటే.. మహేష్ తన నెక్స్ట్ మూవీని రాజమౌళి దర్శకత్వంలో చేయాల్సి ఉంది. 2023 ఫస్ట్ హాఫ్ లో ఈ మూవీ గురించి ఆఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపించాయి.
కానీ ఇప్పుడు 2023 ఎండింగ్ వరకు ఆ ప్రాజెక్ట్ ప్రారంభమయ్యే అవకాశాలు లేవు అని తెలుస్తుంది.ప్రీ ప్రొడక్షన్ పనులకు రాజమౌళి కనీసం 6 నుండి 9 నెలల పాటు టైం తీసుకోవాలి అని భావిస్తున్నాడట. త్రివిక్రమ్ తో సినిమా చేస్తే అది ఏప్రిల్ కు కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి మహేష్ ఇంకో సినిమా చేసుకునే అవకాశం ఉంటుంది. త్రివిక్రమ్ తో చేస్తున్న సినిమాకి మహేష్ రూ.60 కోట్ల పారితోషికం అనుకుంటున్నట్టు కథనాలు వినిపించాయి.
కాబట్టి ఇంకో సినిమా చేసుకుంటే మహేష్ కు ఇంకో రూ.60 కోట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఏ నిర్మాణ సంస్థలో మహేష్ సినిమా చేస్తాడు? ఈ మధ్యనే మహేష్ కు ‘మైత్రి’ వారు రూ.25 కోట్లు అడ్వాన్స్ ఇచ్చారు. కథ కనుక ఓకే అయితే మహేష్ ఈ బ్యానర్లోనే సినిమా చేసే అవకాశం ఉంది. కాబట్టి.. రాజమౌళి నత్తనడక ప్లానింగ్ వల్ల మహేష్ కు రూ.60 కోట్లు కలిసొచ్చే అవకాశం ఉందన్న మాట.