Mahesh Babu: పీకాక్ మ్యాగ్జైన్ వారి ఫన్నీ ర్యాపిడ్ ఫైర్..ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పిన మహేష్..!

మహేష్ బాబు పీకాక్ మ్యాగ్జైన్ కవర్ పేజీ పై కళ కళలాడుతున్న సందర్భాన్ని మనం చూశాం. అయితే వారు మహేష్ తో ర్యాపిడ్ ఫైర్ కూడా నిర్వహించారు. ఇందులో భాగంగా ఎదురైన ప్రశ్నలకి మహేష్ బాబు ఆసక్తికరమైన సమాధానాలు చెప్పాడు. ఆ ప్రశ్నలు మహేష్ చెప్పిన సమాధానాలు ఓ లుక్కేద్దాం పదండి :

1) మీకు ఇష్టమైన అలాగే కోరుకునే ముద్దు పేరు?

జ) నాని

2) బాగా భయపడే సందర్భాలు?

జ) దర్శకుల అంచనాల్ని అందుకోలేనేమో అనే భయం

3) మీ ఇంట్లో మాత్రమే చూపించాలనుకునే హిడెన్ టాలెంట్?

జ)నేను చాలా ఫన్నీ పర్సన్. మా పిల్లలు, భార్యకు ఆ విషయం తెలుసు.

4) జీవితంలో చేసిన అతిపెద్ద అడ్వెంచర్?

జ) న్యూజిలాండ్ లో చేసిన బంగీ జంప్

5) ఎక్కువగా వాడే పదం?

జ) బ్యూటిఫుల్ అనే పదం

6) సినిమా చూస్తూ ఏడ్చిన సందర్భాలు?

జ) లయన్ కింగ్. ఆ సినిమా చూసిన ప్రతిసారి కన్నీళ్లు వస్తాయి

7) మీరు డైరెక్షన్ చేస్తే… మీరు నటించిన ఏ సినిమాల్ని మళ్లీ తీయాలనుకుంటారు?

జ) నేను డైరెక్టర్ గా మారితే ‘ఒక్కడు’ సినిమాను మళ్లీ తీస్తాను

8) ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ?

జ) మా నాన్న గారు నటించిన ‘అల్లూరి సీతారామరాజు’ సినిమా, నా ఆల్ టైమ్ ఫేవరెట్.!

9) ఇప్పటివరకు మీరు తిన్న వింత వంటకం ఏది?

జ) ఓసారి థాయిలాండ్ లో ఏదో సముద్ర వంటకం తిన్నాను. దాని పేరు కూడా గుర్తులేదు. నేను తిన్న వింత వంటకం అదే. అది నాకు అస్సలు నచ్చలేదు.

10) ఫ్యామిలీతో డిన్నర్ చేయాలంటే ఏ రెస్టారెంట్ కు వెళ్తారు?

జ) హైదరాబాద్లో అయితే ఐటీసీ దక్షిణ్ హోటల్ కు వెళ్తాం. అక్కడ సౌతిండియా భోజనం చాలా బాగుంటుంది. మా అందరికీ ఇష్టం. విదేశాల్లో అయితే నోబు రెస్టారెంట్లకు వెళ్లడానికి ఎక్కువ ఇష్టపడతాం.

11) మీరు పడవ కొనుక్కుంటే దానికి ఏం పేరు పెట్టుకుంటారు?

జ) నాకు పడవలంటే ఇష్టం ఉండదు. ఎందుకంటే సముద్ర ప్రయాణం నాకు పడదు. నేను హ్యాండిల్ చేయలేను

12) బిజీ షూటింగ్ షెడ్యూల్ టైంలో ఎలా రిలాక్స్ అవుతారు?

జ)ఫ్యామిలీతో హాలిడే ట్రిప్ కి ఫారెన్ వెళ్తాను. అదే ప్రెజర్ హ్యాండిల్ చేయడానికి బెస్ట్ టెక్నిక్ .

13) ట్రావెలింగ్ టైం లో బాగా ఇష్టపడే అంశం ఏంటి?

జ) రకరకాల వంటకాలు తింటుంటాను. అదే నాకు ఇష్టమైన పార్ట్.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Interviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus