Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు గొప్పదనానికి ఉదాహరణ ఇదే!

స్టార్ హీరో మహేష్ బాబు తండ్రి చనిపోయిన బాధలో కన్నీటి పర్యంతమవుతున్నారు. ఏడుస్తున్న మహేష్ బాబును చూసిన అభిమానులు సైతం బాధ పడుతున్నారు. కొద్దిసేపటి క్రితం అశ్రునయనాల మధ్య కృష్ణ అంత్యక్రియలు ముగిశాయి. ప్రభుత్వ లాంఛనాల మధ్య మహాప్రస్థానంలో కృష్ణకు అంత్యక్రియలు జరిగాయి. కృష్ణ మరణాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. నిర్మాతల పాలిట కృష్ణ ఎంతో మంచితనంతో వ్యవహరించారని ఎంతోమంది నిర్మాతలను కృష్ణ నిలబెట్టారని ఆయన ఫ్యాన్స్ చెబుతున్నారు.

కృష్ణ పార్థివదేహాన్ని చూడటానికి వేల సంఖ్యలో అభిమానులు హాజరు కాగా ఫ్యాన్స్ కు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మహేష్ బాబు ఏర్పాట్లు చేశారు. ఎంతో బాధ ఉన్నా ఫ్యాన్స్ ఎవరూ ఆకలితో తిరిగి వెళ్లకూడదని అందరికీ మహేష్ బాబు భోజనం ఏర్పాట్లు చేశారు. మహేష్ బాబు గ్రేట్ హీరో అని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. మహేష్ బాబు విషాదంలో ఉన్నా ఫ్యాన్స్ ఆకలిని తీర్చారని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. కృష్ణ పార్థివదేహం చూడటానికి వచ్చిన ఫ్యాన్స్ కు మహేష్ బాబు తగిన ఏర్పాట్లు చేశారు.

కార్డియాక్ అరెస్ట్ తో కృష్ణ మృతి చెందగా మహేష్ బాబు అంతిమ సంస్కారాలను నిర్వహించారు. కృష్ణ మరణించినా ఆయన సినిమాలు, జ్ఞాపకాలు, సేవలను మరవలేమని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. చాలా సంవత్సరాల క్రితం కృష్ణ ఒక సందర్భంలో మేము దేవుళ్లం కాదని నటులమని అన్నారు. ప్రేక్షకులకు కాలక్షేపంతో పాటు వినోదాన్ని అందించడమే మా వృత్తి అని చెప్పుకొచ్చారు. హీరోల కొరకు ఎవరూ కొట్టుకోకూడదని ఆయన పేర్కొన్నారు.

అభిమానులు పనులను మానేసి సినిమాలు చూడాల్సిన అవసరం లేదని ఆయన చెప్పుకొచ్చారు. తీరిక వేళల్లోనే సినిమాలు చూడాలని సినిమాను సినిమాలా మాత్రమే చూడాలని కృష్ణ పేర్కొన్నారు. కృష్ణ గతంలో చెప్పిన విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. కృష్ణ మరణించాడనే విషయం నిజం కాకపోతే బాగుండేదని కొంతమంది ఫ్యాన్స్ చెబుతున్నారు.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus