Mahesh Babu: మరోసారి గొప్ప మనసు చాటుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలతో పాటు యాడ్స్ తో కూడా బిజీగా గడుపుతుంటాడు అనే సంగతి తెలిసిందే. టీవీ పెడితే చాలు.. ఏదో ఒక యాడ్లో మహేష్ కనిపిస్తూ ఉంటాడు. అలాగే సినిమాకి వెళ్లినా.. మధ్యలో వచ్చే యాడ్స్ లో మహేష్ దర్శనమిస్తుంటాడు అన్నది అందరికీ తెలిసిన సంగతే.దీంతో మహేష్ బాబు పై నెగిటివ్ కామెంట్లు కూడా వినిపిస్తుంటాయి. ‘మహేష్ బాబు ఇంత డబ్బు మనిషా?’ అని యాంటీ ఫ్యాన్స్ విమర్శించే సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి.

అయితే (Mahesh Babu) మహేష్ కి ఓ మంచి అలవాటు ఉంది. తన సంపాదనలో 30 శాతం సేవా కార్యక్రమాలకి ఖర్చు పెడుతూ ఉంటాడు. యాడ్స్ రూపంలో వచ్చే పారితోషికంలో అయితే 50 శాతం పైనే సేవాకార్యక్రమాలు కోసం ఖర్చు పెడుతుంటాడని ఇన్సైడ్ టాక్. ఆంధ్ర హాస్పిటల్స్ తో కలిసి మహేష్ ఇప్పటికే 1000 కి పైగా హార్ట్ సర్జరీలు చేయించి ఎంతో మంది చిన్నారుల ప్రాణాలు నిలబెట్టాడు అన్నది అందరికీ తెలిసిన సంగతే.

అయితే Heal A Child అనే ఓ NGO సంస్థకి కూడా మహేష్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. ఈ సంస్ధ కూడా పేద పిల్లలకు ఉచితంగా వైద్యాన్ని అందిస్తుంది. ఇటీవల Heal A Child సంస్థ నిర్వహించిన ఓ కార్యక్రమానికి మహేష్ తన భార్య నమ్రతతో కలిసి హాజరయ్యాడు. అయితే విశేషం ఏంటంటే.. ఈ సంస్థ కోసం మహేష్ పారితోషికం వంటివి తీసుకోవడం లేదట. ఇది నిజంగా గొప్ప విషయమే కదా. మరోపక్క
మహేష్ ‘గుంటూరు కారం’ అనే సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు. త్రివిక్రమ్ ఈ చిత్రానికి దర్శకుడు

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus