విదేశీ పార్కుల్లో విహరిస్తున్న మహేష్ ఫ్యామిలీ!

సూపర్ స్టార్ మహేష్ బాబుకి రెండే రెండు ప్రపంచాలు. ఒకటి సినిమా.. రెండోది కుటుంబం. సినిమా షూటింగ్ లేకపోతే మహేష్ కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేస్తుంటారు. ముఖ్యంగా సినిమా సినిమాకి మధ్య గ్యాప్ లో టూర్ కి వెళ్లడం అలవాటు. అదే అలవాటుని ఈసారి కూడా పాటించారు. స్పైడర్ సినిమా తర్వాత భరత్ అను నేను సినిమా చేస్తున్నారు. ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ మొదలుకావడానికి కొన్ని రోజుల గ్యాప్ రావడంతో ఆ డేస్ ని పిల్లలకోసం కేటాయించారు. అమెరికా, ఇటలీ, స్పెయిన్‌ దేశాలు తిరుగుతున్నారు.

అక్కడ పిల్లలు ఎంజాయ్‌ చేసే ఎమ్యూజ్‌మెంట్‌ పార్కులు అయిన డిస్నీల్యాండ్‌, టుమారోల్యాండ్, హాలీవుడ్‌ స్టూడియోలలో గౌతమ్, సితారలతో సరదాగా గడుపుతున్నారు. మహేశ్‌ ఫ్యామిలీతో పాటు ఈసారి మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మాతల్లో ఒకరైన నవీన్‌ ఎర్నేని ఫ్యామిలీ కూడా జత కలిసింది. మహేష్ పిల్లలు నవీన్‌ ఎర్నేని పిల్లలతో బాగా కలసిపోయారు. వారు కలిసి తీసుకున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో లైకులు అందుకుంటోంది. ఈ టూర్ రెండు రోజుల్లో పూర్తి అవుతుందని సమాచారం. ఇంటికి తిరిగిరాగానే భరత్ అనే నేను సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారు. బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీ వచ్చే వేసవిలో రిలీజ్ కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus