సీఎం సీటుపై కన్నేసిన మహేశ్ బాబు
- June 8, 2017 / 07:01 AM ISTByFilmy Focus
సూపర్ స్టార్ మహేష్ బాబుకి రాజకీయాలపై పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. అసలు ఎమ్మెల్యే, ఎంపీకి కూడా తేడా తెలియదని స్వయంగా చెప్పారు. కానీ ఇప్పుడు పాలిటిక్స్ పై దృష్టిపెట్టారు. అసెంబ్లీలో అడుగుపెట్టి తోటి ఎమ్మెల్యేలను తన మాటలతో ఆకట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. మహేష్ బాబు ప్రస్తుతం స్పైడర్ మూవీని కంప్లీట్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఈ మూవీ తర్వాత వెంటనే కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు 24 వ మూవీ చేస్తున్నారు. “భరత్ అను నేను” అనే టైటిల్ ఖరారు చేసిన ఈ మూవీ మొదటి షెడ్యూల్ గతవారం హైదరాబాద్లో జరిగింది. రెండో షెడ్యూల్ జూన్16 నుంచి మొదలుకాబోతోంది.
ఆ షెడ్యూల్లో మహేష్ పాల్గొననున్నారు. ఇందుకోసం హైదరాబాద్ సిటీ శివార్లలో ఒక భారీ అసెంబ్లీ సెట్ వేస్తున్నారు. ఈ సెట్ దాదాపు పూర్తి కావచ్చింది. ఈ అసెంబ్లీలో మహేష్ ముఖ్యమంత్రిగా దడదడలాడించనున్నారు. దూకుడులో కొంత సేపు ఎమ్మెల్యేగా ప్రిన్స్ కనిపించి సందడి చేశారు. భరత్ అను నేనులో మాత్రం ఆ సందడి ఎక్కువసేపు ఉండనుంది. భారీ బడ్జెట్ తో డి.వి.వి. దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ హీరోయిన్ గా ఖరారు అయింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని 2018 సంక్రాంతికి విడుదల చేయనున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















