వందల కోట్లు ఖర్చు పెట్టి తీసే సినిమాలకి.. సరైన మార్కెటింగ్ లేకపోతే అవి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేస్తాయి. చాలా సినిమాల విషయంలో ఇది ప్రూవ్ అయ్యింది. నిర్మాత ఎన్ని వందల కోట్లు పెట్టి తీసినా.. దానికి సంబంధించిన ఆసక్తికర ఫుటేజీ జనాల్లోకి వెళ్లేలా చేయకపోతే .. ఆ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి ఉండదు. అయితే భారీ బడ్జెట్ తో తీసే సినిమాలకి మార్కెటింగ్ ఎలా చేసుకోవాలో.. రాజమౌళికి (S. S. Rajamouli) తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలీదు అనే చెప్పాలి.
పైసా ఖర్చు లేకుండా పీఆర్ ఎలా చేసుకోవాలో దర్శకుడు రాజమౌళికి తెలిసినంతలా ఇండియాలో మరో దర్శకుడికి తెలీదు అనే చెప్పాలి. జస్ట్ పది సెకండ్ల ఫుటేజీతో సోషల్ మీడియాని షేక్ చేసే సత్తా రాజమౌళికి ఉంది. మహేష్ బాబుతో (Mahesh Babu) ప్రస్తుతం అతను ఒక సినిమా చేస్తున్నాడు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది లేదు. పూజా కార్యక్రమాలు అయ్యాయి. కానీ ఒక్క ఫోటో కూడా బయటకు రాలేదు. అయినా (SSMB 29) ‘#SSMB29′(హ్యాష్ ట్యాగ్) ఇంటర్నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతుంది.
సింహాన్ని లోపల పెట్టి.. పాస్ పోర్ట్ చేజిక్కించుకున్నారు అని తెలియజేస్తూ ఒక వీడియో చేశారు రాజమౌళి. మహేష్ బాబు ఎక్కువగా విదేశాలకి వెళ్తూ ఉంటాడు. అందువల్ల అతను నటించే సినిమాల షూటింగ్స్ ఎక్కువగా పోస్ట్ పోన్ అవుతూ ఉంటాయి. దర్శక నిర్మాతలు ఈ విషయంలో అసంతృప్తితో ఉంటారు అనే విమర్శ కూడా ఉంది. ఆ ప్రాబ్లమ్ రాకుండా పాస్ పోర్ట్ తీసుకున్నట్లు రాజమౌళి సింబాలిక్ చెప్పాడు. ఆ వీడియో ఇంటర్నేషనల్ వైడ్ వైరల్ అయ్యింది.
అయితే లేటెస్ట్ షెడ్యూల్ విదేశాల్లోనే నిర్వహిస్తున్నారు. దీంతో మహేష్ బాబు పాస్ పోర్ట్ వెనక్కి ఇవ్వాల్సి వచ్చినట్టు ఉంది. తాజాగా ఎయిర్పోర్టులో దర్శనమిచ్చిన మహేష్ బాబు.. చేతిలో ఉన్న పాస్ పోర్ట్ ను పాపారాజీ టీంకి చూపించి.. సర్ప్రైజ్ చేశాడు. ఆ టైంలో బాబు ఇచ్చిన స్మైల్ కూడా అదిరిపోయింది. మహేష్ టైమింగ్ ని రాజమౌళి ఈ రకంగా వాడుకుని మరోసారి ‘#SSMB29’ (SSMB 29) ట్యాగ్ ను గ్లోబల్ లెవెల్లో ట్రెండ్ అయ్యేలా చేశాడు అని చెప్పాలి.
Passport is back to @urstrulyMahesh hand @ssrajamouli @MaheshBabu_FC @MaheshBabuNews #SSMB29 #MaheshBabu pic.twitter.com/O6cZVHQrdF
— Phani Kumar (@phanikumar2809) April 5, 2025