Mahesh: ఆ కారణంతోనే మహేష్ సినిమాలకు దూరమవుతున్నారా?

  • June 1, 2023 / 08:11 PM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. సర్కారు వారి పాట సినిమాతో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మరో సినిమాకు కమిట్ అయ్యారు. ప్రస్తుతం ఈ సినిమా చాలా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయడానికి మేకర్స్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇక తాజాగా కృష్ణ గారి జయంతి సందర్భంగా ఈ సినిమాకు టైటిల్ కూడా ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రాబోతున్నటువంటి ఈ సినిమాకి గుంటూరు కారం అనే టైటిల్స్ ప్రకటించారు.ఈ సినిమా టైటిల్ తోనే సినిమా ఎలా ఉండబోతుందో అందరికీ క్లారిటీ ఇచ్చారు డైరెక్టర్ త్రివిక్రమ్. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు. ఇలా రాజమౌళి సినిమాతో మహేష్ బాబు బిజీ కానున్న నేపథ్యంలోనే ఈయన సినిమాలకు బ్రేక్ ఇవ్వబోతున్నారని తెలుస్తుంది.

రాజమౌళి సినిమా అంటేనే ఆ సినిమా కోసం ఎంతగా కష్టపడాలో అందరికీ తెలిసిందే. రాజమౌళితో సినిమా కమిట్ అయితే ఇతర సినిమాలు చేసే అవకాశం అస్సలు ఇవ్వరు జక్కన్న. ఎందుకంటే తన సినిమాకు సంబంధించిన లుక్ఏమాత్రం బయటపడకుండా జాగ్రత్త తీసుకుంటూ ఉంటారు అందుకే హీరోలు ఇతర సినిమాలలో నటించడానికి వీలు లేదు.

ఇక రాజమౌళి సినిమా అంటే సుమారు రెండు మూడు సంవత్సరాలు పాటు (Mahesh) మహేష్ బాబు తన కాల్ షీట్స్ అన్ని కూడా ఇవ్వాల్సి ఉంటుంది.ఈ క్రమంలోనే రాజమౌళి సినిమా పూర్తి అయ్యేవరకు ఈయన ఇతర సినిమాలకు కమిట్ అవ్వకుండా ఇతర సినిమాల నుంచి కాస్త విరామం తీసుకోబోతున్నారని కేవలం రాజమౌళి సినిమాతోనే మహేష్ బాబు బిజీ కానున్నారని తెలుస్తోంది.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus