అప్పట్లో చిరంజీవి “శంకర్ దాదా జిందాబాద్” అనంతరం సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి వెళ్ళిపోయినప్పుడు ఇండస్ట్రీలో “నెంబర్ ఒన్” సీట్ చాన్నాళ్లు ఖాళీగా ఉండిపోయింది. అప్పటికి మంచి స్టార్ డమ్ ఎంజాయ్ చేస్తున్న మహేష్ బాబు కూడా చిరంజీవి తర్వాత ఆ నెంబర్ ఒన్ పొజిషన్ తనది అని చెప్పుకోవడానికి ముందుకురాలేదు. దాదాపు ఆరేళ్ళ తర్వాత ఆ నెంబర్ ఒన్ స్థానాన్ని పవన్ కళ్యాణ్-మహేష్ బాబు సమానంగా పంచుకొన్నారు. మధ్యలో రామ్ చరణ్, ఎన్టీయార్ లు వీరలెవల్లో ట్రై చేసినప్పటికీ నెంబర్ ఒన్ పొజిషన్ కు రాలేకపోయారు. మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లిపోవడం, ఇకపై సినిమాలు చేయను అంటూ పబ్లిక్ గా చెప్పేయడంతో నెక్స్ట్ నెంబర్ ఒన్ హీరో ఎవరు అనే విషయంపై ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చలు గట్టిగానే అవుతున్నాయి. ఇప్పుడిప్పుడే హీరోగా నిలదొక్కుకుంటున్న రామ్ చరణ్, అల్లు అర్జున్ లను ఎలాగూ నెంబర్ ఒన్ హీరోలుగా పేర్కొనలేం.
దాంతో ఎన్టీయార్-మహేష్ బాబుల నడుమ పోటీ మొదలైంది. అయితే.. ఎన్టీయార్ సినిమాలు హిట్ అవుతున్నప్పటికీ డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు తెచ్చిపెట్టలేకపోతున్నాయి. దాంతో మహేష్ బాబును ప్రస్తుత ఇండస్ట్రీ నెంబర్ ఒన్ హీరోగా డిక్లేర్ చేస్తున్నారు సినీ విశ్లేషకులు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లు ఇంకా ఫామ్ లోనే ఉన్నప్పటికీ వారిని సీనియర్లుగా డిక్లేర్ చేసి మహేష్ ను నెంబర్ ఒన్ అంటున్నారు. అయితే.. ఈ స్థానాన్ని పదిలపరుచుకోవాలంటే మాత్రం మహేష్ ఇమ్మీడియట్ గా “భరత్ అనే నేను”తో సూపర్ హిట్ కొట్టడంతోపాటు నెక్స్ట్ మూడు సినిమాలతో కనీసం 150 కోట్ల రూపాయల షేర్ సాధించాలి. లేదంటే ఎన్టీయార్, అల్లు అర్జున్ లు మళ్ళీ ఆ నెంబర్ ఒన్ పొజిషన్ కోసం తలపడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మరి పవన్ కళ్యాణ్ వదిలిన ఈ స్పేస్ ను మహేష్ ఏమేరకు సద్వినియోగపరుచుకుంటాడో చూడాలి.