పవన్ కళ్యాణ్- మహేష్ బాబు ఒకప్పుడు పోటాపోటీగా సినిమాలు చేసేవారు. ఇద్దరికీ కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇంకా చెప్పాలంటే మ్యూచువల్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు అని చెప్పాలి. వీరి కాంబినేషన్లో మల్టీస్టారర్ వస్తే చూడాలని ఆశపడని ప్రేక్షకులు తెలుగు రాష్ట్రాల్లో ఉండరు అనడంలో కూడా అతిశయోక్తి లేదు. మరోపక్క సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు..ల ఫ్యాన్స్ కొంతమంది ఒకరినొకరు ట్రోలింగ్ చేసుకుంటున్న సందర్భాలు కూడా ఎక్కువగానే ఉంటాయి.
ఆ విషయాలు పక్కన పెట్టేస్తే.. వ్యక్తిగతంగా మహేష్ బాబుకి పవన్ కళ్యాణ్ అంటే చాలా అభిమానం. ఇద్దరి మైండ్ సెట్స్ సిమిలర్ గా ఉంటాయని ఇద్దరికీ కామన్ ఫ్రెండ్ అయినటువంటి త్రివిక్రమ్ పలు మార్లు చెప్పడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ ప్రతి పుట్టినరోజుకి మహేష్ బాబు స్పెషల్ గా విషెస్ చెబుతూ పోస్టులు పెడుతూ ఉంటారు. నిన్న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నాడు కూడా మహేష్ బాబు.. విషెస్ చెబుతూ పోస్ట్ పెట్టారు.
ఇదిలా ఉంటే.. ఇటీవల పవన్ కళ్యాణ్ ను మహేష్ బాబు కలిసినట్టు టాక్ నడుస్తుంది. అది కూడా తన కుమారుడు గౌతమ్ కోసమని అంటున్నారు. విషయం ఏంటంటే.. గౌతమ్ వయసు 19 కి వచ్చింది. ఈ నేపథ్యంలో అతన్ని హీరోగా లాంచ్ చేయాలనే ప్రెజర్ కూడా మహేష్ బాబుపై ఉంది. అయితే అందుకు సరైన శిక్షణ కూడా ఇప్పించాలి. ఇందు కోసం పవన్ ను మహేష్ కలిసి.. గౌతమ్ మార్షల్ ఆర్ట్స్ శిక్షణ కొరకు చర్చించారట.
పవన్ కళ్యాణ్ కూడా అకీరాకి మార్షల్ ఆర్ట్స్ అలాగే సంగీతంలో శిక్షణ ఇప్పిస్తున్నారు. అందుకే గౌతమ్ విషయంలో మహేష్ పవన్ సలహా తీసుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం.