నమ్రతతో నాలుగేళ్లు డేటింగ్ చేసిన మహేష్ బాబు!
- December 27, 2016 / 11:08 AM ISTByFilmy Focus
బాలీవుడ్ హీరోయిన్ నమ్రత శిరోద్కర్ కి సూపర్ స్టార్ మహేష్ బాబుకి వంశీ మూవీ సినిమా సమయంలో పరిచయం ఏర్పడింది. పరిచయం స్నేహమై, ప్రేమ చిగురించి పెళ్లిదాకా తీసుకెళ్లింది. భార్య భర్తలై ఇద్దరు పిల్లలు తల్లిదండ్రులై ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు వారి గురించి ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే.. వంశీ మూవీ షూటింగ్ ఎండింగ్ లో ఇద్దరి మధ్య ప్రేమ ఉందని తెలుసుకున్న వీరిద్దరూ వెంటనే పెళ్లి నిర్ణయం తీసుకోలేదంట. నాలుగేళ్లపాటు డేటింగ్ లో ఉన్నారని తాజాగా తెలిసింది.
ఉత్తర భారత దేశానికీ చెందిన నమ్రత 1993 లో మిస్ ఇండియా కిరీటం అందుకున్నారు. 1998లో నమ్రత బాలీవుడ్ లో అడుగు పెట్టారు. తెలుగులో వంశీ ద్వారా పరిచయమయ్యారు. ఈ సినిమాలో 2000 సంవత్సరంలో విడుదలయింది. అప్పుడే ప్రేమలో ఉన్నప్పటికీ ఇద్దరూ వృత్తిలో బిజీ అయ్యారు. మహేష్ కంటే నమ్రత మూడేళ్లు పెద్దది. వారి మతం, కులం వేరు. దీంతో వీరిద్దరి పెళ్ళికి మహేష్ కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో 2005 వరకు డేటింగ్ చేస్తూ పెద్దలను ఒప్పించడానికి ప్రయత్నించారు. అయినా ఒప్పుకోక పోయేసరికి నమ్రత కుటుంసభ్యుల సమక్షంలో ముంబై లో ఫిబ్రవరి 10 , 2005 న ఒకటయ్యారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















