టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన మహేష్ బాబు ప్రస్తుతం ఒకవైపు సినిమాలతో మరోవైపు యాడ్స్ తో బిజీగా ఉన్నారు. సూపర్ స్టార్ మహేష్ రెమ్యునరేషన్ ప్రస్తుతం 70 కోట్ల రూపాయల నుంచి 80 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండగా రాజమౌళి సినిమా నుంచి మహేష్ పారితోషికం 100 కోట్ల రూపాయలకు చేరనుందని తెలుస్తోంది. మరోవైపు మహేష్ బాబు వరుస యాడ్స్ లో నటిస్తూ భారీ మొత్తంలో సంపాదిస్తున్నారు. సాయి సూర్య డెవలపర్స్ కు మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.
అయితే ఈ సంస్థపై తాజాగా చీటింగ్ కేసు నమోదు కావడం హాట్ టాపిక్ అవుతోంది. ఈ సంస్థ యజమాని మోసం చేశారంటూ ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పోలీసులను ఆశ్రయించడం గమనార్హం. నక్క విష్ణువర్ధన్ అనే వ్యక్తి తన ఫ్రెండ్స్ తో ఈ సంస్థలో మూడు కోట్ల 21 లక్షల 34 వేల రూపాయలు ఇన్వెస్ట్ చేశారు. షాద్ నగర్ లోని ఒక పొలంపై ఈ పెట్టుబడిని పెట్టినట్టు సమాచారం అందుతోంది.
హెచ్.ఎం.డీ.ఏ అనుమతులు వచ్చిన తర్వాత ఫ్లాట్లను రిజిష్టర్ చేస్తామని చెప్పారని అయితే మార్ట్ గేజ్ ఫ్లాట్లను సైతం ఇతర ఫైనాన్షియర్ల పేర్లపై రాయడంతో విష్ణువర్ధన్, అతని సన్నిహితులు మధురానగర్ పోలీసులను ఆశ్రయించారు. సాయిసూర్య డెవలపర్స్ యజమానులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఏదైనా ప్రముఖ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహారించడానికి ముందు (Mahesh Babu) మహేష్ లాంటి వ్యక్తులు ఆ సంస్థకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుంటే మంచిది. ఈ తరహా వివాదాల వల్ల మహేష్ బాబు ఇమేజ్ డ్యామేజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మహేష్ బాబు రాబోయే రోజుల్లో అయినా మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని నెటిజన్ల నుంచి సూచనలు వ్యక్తమవుతున్నాయి.
‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!
ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!