Mahesh Babu, Rajamouli: రాజమౌళి సినిమాలో మహేష్ బాబు షాకింగ్ లుక్ చూస్తామా..?!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫిట్నెస్ విషయంలో పర్ఫెక్ట్ గా ఉంటాడు.అతని వయసు 48 ఏళ్ళు అయినప్పటికీ.. 25 ఏళ్ళ కుర్రాడిలానే కనిపిస్తూ ఉంటాడు. ‘గుంటూరు కారం’ సినిమాలో కూడా మహేష్ ఎంత యంగ్ గా కనిపించాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇదిలా ఉండగా.. ఇప్పుడు మహేష్ బాబు .. రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. రాజమౌళితో సినిమా అంటే వ్యవహారం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒళ్ళు హూనం చేసుకుని అతని సినిమాల కోసం హీరోలు కష్టపడాల్సిందే.

ప్రభాస్, ఎన్టీఆర్, రాంచరణ్.. వంటి వారు ఎలా రాజమౌళి సినిమాల కోసం కష్టపడ్డారో మేకింగ్ వీడియోల ద్వారా చూశాము. ఇక ఇప్పుడు మహేష్ వంతు వచ్చింది. ఆల్రెడీ స్పెషల్ ట్రైనర్ ను పెట్టుకుని మహేష్.. బాగా కష్టపడుతున్నాడు. ఈ మధ్యనే విదేశాలకు కూడా వెళ్లి అక్కడి వైద్యుల వద్ద హెల్త్ అప్సెట్ అవ్వకుండా కొన్ని టిప్స్ తెలుసుకుని వచ్చాడు. మహేష్ బాబు ఇప్పటివరకు ఒక్క సినిమాలో కూడా షర్ట్ తీసేసి కనిపించింది లేదు.

సుకుమార్ ‘1 నేనొక్కడినే’ లో మాత్రమే షర్ట్ తీసేసి ఒకటి,రెండు షాట్లలో కనిపించాడు. కానీ ఇప్పుడు రాజమౌళి సినిమా కోసం అతను షర్ట్ విప్పాల్సిందే. అందుకే ఆల్రెడీ అతనికి 6 ప్యాక్ బాడీ ఉన్నప్పటికీ .. అంతకు మించిన బాడీ బిల్డ్ చేసుకోవడానికి కసరత్తులు మొదలుపెట్టాడు. అలాగే లాంగ్ హెయిర్ కూడా పెంచుతున్నాడు. సో రాజమౌళి సినిమాలో మహేష్ ను (Mahesh Babu) చాలా కొత్తగా చూడబోతున్నామన్న మాట

యాత్ర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

ఈగల్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాల్ సలామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus