న్యూఇయర్ కి మహేష్ బాబు ప్లాన్!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకుడు పరశురామ్ ‘సర్కారు వారి పాట’ అనే సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. కరోనా కారణంగా వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్ జనవరి 4నుండి మొదలుకానుంది. కథ ప్రకారం అమెరికాలో కొంత భాగాన్ని చిత్రీకరించనున్నారు. అయితే చిత్రబృందం కంటే ముందుగానే మహేష్ బాబు అమెరికాకు పయనమవనున్నారు. ఈ క్రిస్మస్ అమెరికాలో జరుపుకోవాలని.. న్యూఇయర్ సెలబ్రేషన్స్ కూడా అక్కడే చేసుకోవాలని మహేష్ భావిస్తున్నాడు.

అందుకే తన ఫ్యామిలీతో సహా డిసెంబర్ 24న అమెరికా ఫ్లైట్ ఎక్కబోతున్నారు. మహేష్ వెళ్లిన వారం రోజుల తరువాత మిగిలిన బృందం అమెరికా వెళ్లనుంది. ఇలా తన ఫ్యామిలీతో అమెరికా ట్రిప్, అలానే షూటింగ్ కూడా కలిసొస్తుందని మహేష్ ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. షూటింగ్ విషయానికొస్తే. అమెరికాలో 45 దాదాపు రోజుల పాటు షూటింగ్ ను నిర్వహించనున్నారు. ప్రస్తుతం లొకేషన్లు ఫైనల్ చేసే పనిలో పడ్డారు. సోషల్ మెసేజ్‌తో కూడిన స్ట్రాంగ్ కథాంశంతో ఈ సినిమా స్క్రిప్ట్ రెడీ చేసినట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా అవినీతికి సంబంధించిన సామాజిక అంశాన్ని ఈ సినిమాలో చూపించనున్నట్లు టాక్. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం వేట సాగుతోంది. ఉపేంద్ర, అరవింద్ స్వామీ లాంటి నటుల పేర్లు వినిపిస్తున్నాయి. మరో వారంలో విలన్ ని ఫైనలైజ్ చేయనున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు.

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus