టాలీవుడ్ లో నంబర్ వన్ స్థానం మహేష్ బాబుదే .!

సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా చిత్ర సీమలోకి అడుగుపెట్టిన మహేష్ బాబు అతి తక్కువకాలంలోనే సూపర్ స్టార్ గా నిరూపించుకున్నారు. ఒక్కడు, దూకుడు వంటి సినిమాలతో టాలీవుడ్ టాప్ చైర్ లో కూర్చున్నారు. అత్యధిక కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించి ఈ కేటగిరీలో మొదటి స్థానంలో నిలిచారు. తాజాగా ట్విట్టర్ ఫాలోయింగ్ లోను మొదటిస్థానాన్ని కైవశం చేసుకున్నారు. మహేష్ ట్విటర్‌ అకౌంట్‌ను అనుసరించే వారి సంఖ్య 6 మిలియన్లకు చేరింది. తెలుగులో ఈ ఘనత అందుకున్న తొలి హీరో అతనే. ఇక అతని తర్వాత  అక్కినేని నాగార్జున నిలిచారు. టాలీవుడ్ మన్మథుడు నాగ్ ని ఫాలో అవుతున్నవారి సంఖ్య 5 మిలియన్లకు పైనే ఉంది. అతి తెలుగు, తమిళంలో అత్యధిక అభిమానులున్న కమల్‌ హాసన్‌, రజనీకాంత్‌లను

ఫాలోఅవుతున్నవారి సంఖ్య 4 మిలియన్లుగా ఉంది. వారికన్నా ఎక్కువమంది ఫాలోవర్స్ ని మహేష్ సొంతం చేసుకున్నారు. ఇక హీరోయిన్స్ విషయానికి వస్తే దక్షిణాదిలోనే అత్యధిక ఫాలోవర్స్ కలిగిన నటిగా శృతిహాసన్ నిలిచింది. ఈమెకు 7 మిలియన్స్ మంది ఫాలోవర్స్ ఉన్నారు. 6 మిలియన్ల ఫాలోవర్స్ తో సమంతను శృతి తర్వాతి స్థానాన్ని పొందింది. మహేష్ బాబు గత చిత్రాలు ఫెయిల్ అయినప్పటికీ ఫాలోవర్స్ రోజురోజుకి పెరిగిపోవడం విశేషం. ప్రస్తుతం మహేష్ కొరటాల శివ దర్శకత్వంలో భరత్‌ అను నేను’ సినిమా చేస్తున్నారు. చివరి పాట షూటింగ్ ని ముగించుకొని చిత్ర బృందం నేడు హైదరాబాద్ కి వచ్చింది. మహేష్ ముఖ్యమంత్రిగా నటిస్తున్న ఈ చిత్రంలో కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్‌ 20న  రిలీజ్ కానుంది .

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus