Mahesh Babu: మహేష్ త్రివికమ్ మూవీ సెట్స్ పైకి వెళ్లేది అప్పుడేనా?

మహేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో అతడు, ఖలేజా సినిమాలు వచ్చాయి. అతడు సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ అనిపించుకుంటే ఖలేజా మూవీ మాత్రం ఫ్లాప్ అయింది. అయితే బుల్లితెరపై మాత్రం ఈ రెండు సినిమాలు సక్సెస్ సాధించడం గమనార్హం. మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కాల్సి ఉండగా ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది మార్చికి వాయిదా పడిందని సమాచారం. గత కొన్నిరోజులుగా మహేష్ బాబుకు సర్జరీ అని వార్తలు వస్తున్నాయి.

సర్జరీ వల్ల సర్కారు వారి పాట షూటింగ్ జనవరికి పోస్ట్ పోన్ అయిందని సమాచారం. వైద్యులు సర్జరీ తర్వాత మహేష్ కనీసం రెండు నెలలు రెస్ట్ తీసుకోవాలని సూచించినట్టు బోగట్టా. మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ అంతకంతకూ ఆలస్యమవుతూ ఉండటంతో మహేష్ ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు. ఈ సినిమాలో మహేష్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తున్నారు. సర్కారు వారి పాట సినిమా షూటింగ్ దాదాపుగా 80 శాతం పూర్తైందని తెలుస్తోంది. సంక్రాంతి నుంచి ఈ సినిమా ప్రమోషన్స్ మొదలు కానున్నాయని సమాచారం.

సర్కారు వారి పాట సినిమాలో మహేష్ కు జోడీగా కీర్తి సురేష్ నటించారు. గతంలో మహేష్ హీరోగా నటించిన సినిమాలు ఏప్రిల్ లో విడుదలై సక్సెస్ ను సొంతం చేసుకోవడంతో ఈ సినిమా కూడా సక్సెస్ సాధిస్తుందని అభిమానులు భావిస్తున్నారు.హ్యాట్రిక్ హిట్లతో జోరుమీదున్న మహేష్ తరువాత సినిమాలతో కూడా విజయాలను అందుకుంటారేమో చూడాలి. మహేష్ ఒక్కో సినిమాకు 50 కోట్ల రూపాయలకు అటూఇటుగా పారితోషికం తీసుకుంటున్నారు.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus