Mahesh Babu, Trivikram: మహేష్ ప్లాన్ వర్కౌట్ కావడం సాధ్యమేనా?

మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన సర్కారు వారి పాట సినిమా వచ్చే నెల 12వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. పరశురామ్ డైరెక్షన్ లో భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా మహేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో అతడు, ఖలేజా సినిమాల తర్వాత తెరకెక్కుతున్న సినిమా వేర్వేరు కారణాల వల్ల వాయిదా పడుతున్న సంగతి తెలిసిందే.

మరోవైపు మహేష్ రాజమౌళి డైరెక్షన్ లో ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ ఏడాది ఎండింగ్ లో మహేష్ సినిమాను మొదలుపెడతానని జక్కన్న ఇప్పటికే స్పష్టం చేశారు. మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ జూన్ నెల నుంచి మొదలుకానుంది. అయితే ఈ సినిమాను కేవలం నాలుగు నెలల్లోనే పూర్తి చేయాలని మహేష్ బాబు భావిస్తున్నారని సమాచారం అందుతోంది. జానీ మాస్టర్ కంపోజ్ చేసే సాంగ్ తో ఈ సినిమా షూటింగ్ మొదలుకానుందని బోగట్టా.

థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా ఇప్పటికే ఈ సినిమా కోసం కొన్ని ట్యూన్లు సిద్ధమయ్యాయని తెలుస్తోంది. వరుస విజయాలతో జోరుమీదున్న త్రివిక్రమ్ ఈ సినిమాతో గత సినిమాలను మించిన విజయాన్ని సొంతం చేసుకోవాలని భావిస్తున్నారు. మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతోందని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను త్వరగా పూర్తి చేసి జక్కన్న సినిమాతో బిజీ కావాలని మహేష్ భావిస్తున్నారు. అయితే త్రివిక్రమ్ సినిమా విషయంలో మహేష్ బాబు ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో చూడాల్సి ఉంది.

హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. మహేష్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. సినిమాసినిమాకు మహేష్ బాబు త్రివిక్రమ్ మార్కెట్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus