దాదాపు 10 నెలల నుండీ ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ రేట్ల ఇష్యు నడుస్తుంది.’వకీల్ సాబ్’ సినిమా టైములో ఉన్నట్టు ఉండి ఏపి ప్రభుత్వం టికెట్ రేట్లను తగ్గించేసే పని పెట్టుకుంది. ఆ టైములో సెకండ్ లాక్ డౌన్ పడింది కాబట్టి… వెంటనే సినిమా పెద్దలు ఆ విషయాన్ని పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు. కానీ పరిస్థితి సాధారణ స్థితికి వచ్చాక పెద్ద సినిమాలు విడుదల చేయడానికి టికెట్ రేట్ల ఇష్యు అందరికీ గుర్తొచ్చింది.
ఈ విషయం పై పవన్ కళ్యాణ్… ‘రిపబ్లిక్’ సినిమా వేడుకలో మాట్లాడితే… ఏపి ప్రభుత్వం మరింతగా మండి పడి మరింతగా టికెట్ రేట్లను తగ్గించేసింది.ఈ క్రమంలో దిల్ రాజు వంటి సినీ పెద్దలు వెళ్ళి పేర్ని నాని వంటి వారిని సంప్రదిస్తే ఉపయోగం లేకపోయింది. అయితే కొద్దిరోజుల నుండీ చిరంజీవి తన వంతు ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. మొన్నటికి మొన్న వెళ్ళి ఆయన ఏపి ముఖ్యమంత్రి జగన్ ను కలిశారు.ఆయన సానుకూలంగా స్పందించినట్టు కూడా చిరు తెలిపారు.
అయితే రేపు మళ్ళీ ఈ విషయం పై చిరుతో జగన్ మీట్ అవ్వడానికి పిలుపునిచ్చారు. దీంతో ఈ మీటింగ్ కు చిరు… తనతో పాటు మరికొంత మంది స్టార్ హీరోలను వెంటబెట్టుకుని వెళ్ళాలని డిసైడ్ అయ్యారట. ఈ క్రమంలో ఆయన మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్ లను సంప్రదించారట. కుదిరితే వీళ్ళు కూడా వెళ్ళి జగన్ తో మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఫిబ్రవరి 10కి ఈ ఇష్యుకి ఫుల్ స్టాప్ పెట్టాలని ఏపి ప్రభుత్వం కూడా భావిస్తున్నట్టు తెలుస్తుంది.
Most Recommended Video
బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
అంతా ఓకే అయ్యి ఆగిపోయిన చిరంజీవి సినిమాలివే!