Mahesh Babu, Rajamouli: మహేష్- రాజమౌళి ప్రాజెక్టుకి సంబంధించి గూజ్ బంప్స్ తెప్పించే అప్డేట్..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. ‘పోకిరి’ టైం నుండీ వీరిద్దరూ కలిసి సినిమా చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. కానీ టైం అండ్ స్క్రిప్ట్ కుదరలేదు.శ్రీ దుర్గా ఆర్ట్స్ అధినేత కె.ఎల్.నారాయణ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత తన నెక్స్ట్ మూవీ మహేష్ బాబుతోనే అని రాజమౌళి అనౌన్స్ చేసేసాడు. ఒకటి కాదు రెండు కాదు చాలా సందర్భాల్లో ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసాడు.

Click Here To Watch

మహేష్ బాబు కూడా రాజమౌళితో సినిమా చేయబోతున్నట్టు చెప్పకనే చెప్పాడు. త్రివిక్రమ్ తో మూవీ కంప్లీట్ అయిన వెంటనే మహేష్ తో రాజమౌళి సినిమా సెట్స్ పైకి వెళ్ళనుంది. అయితే ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. అదేంటి అంటే.. రాజమౌళితో మహేష్ బాబు చేయబోయేది మల్టీస్టారరట. అయితే ఆ రెండో హీరో ఎవరు అన్నది ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. రాజమౌళి ఒప్పుకోవాలె కానీ ఒక్క టాలీవుడ్ నుండే కాదు కోలీవుడ్, బాలీవుడ్ ఇలా ఏ భాషలో అయినా స్టార్ హీరోలు రెడీగా ఉంటారు.

అయితే రాజమౌళి మాత్రం టాలీవుడ్ కు సంబంధించిన స్టార్ హీరోనే ఎంపిక చేసుకోవాలని భావిస్తున్నాడట.మరి ప్రెజెంట్ ట్రెండ్లో ఉన్న స్టార్ హీరోలని ఎంపిక చేసుకుంటాడా లేక సీనియర్ స్టార్ హీరోని ఎంపిక చేసుకుంటాడా అనేది తెలియాల్సి ఉంది. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే.. మహేష్ తో ఆ స్టార్ హీరోకి కాంబినేషనల్ సీన్స్ ఉండవట. అతని పాత్ర సినిమాలో 40 నిమిషాల పాటు ఉంటుందట. అది సినిమాకి అత్యంత కీలకమని తెలుస్తుంది.

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus