ప్రతి స్టార్ హీరో కెరీర్ లో సక్సెస్ ఫెయిల్యూర్ ఉంటాయనే సంగతి తెలిసిందే. సక్సెస్ వచ్చిన సమయంలో ఎంతో సంతోషించే హీరోలు ఫెయిల్యూర్ వస్తే మాత్రం బాధ పడతారు. మహేష్ బాబు సినీ కెరీర్ లో ఎక్కువ సినిమాలు సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. అయితే అదే సమయంలో మహేష్ నటించిన కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. గత కొన్నేళ్ల నుంచి వరుస విజయాలతో జోరుమీదున్న మహేష్ తాజాగా అన్ స్టాపబుల్ టాక్ షోకు హాజరయ్యారు.
ఈ షోలో సైనికుడు, అతిథి సినిమాల తర్వాత మూడేళ్లు గ్యాప్ తీసుకోవడం గురించి మహేష్ బాబు మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. ఆ మూడేళ్ల గ్యాప్ లో తనను తాను ఆవిష్కరించుకున్నానని అది నా జీవితంలో కష్టమైన పీరియడ్ అని మహేష్ బాబు అన్నారు. మొదట ఏడాది గ్యాప్ తీసుకుందామని అనుకుంటే ఆ గ్యాప్ రెండున్నరేళ్లు అయిందని మహేష్ కామెంట్లు చేశారు. నన్ను నేను కరెక్ట్ చేసుకోవడానికి మూడేళ్ల సమయం అవసరమైందని ఆ తర్వాత వెనక్కు తిరిగి ఆలోచించాల్సిన అవసరం ఏర్పడలేదని మహేష్ బాబు అన్నారు.
మనపై మనకు నమ్మకం ఉండాలని ఇతర హీరోలు బ్లాక్ బస్టర్ హిట్లు సాధిస్తున్నా తాను పట్టించుకోనని మహేష్ చెప్పుకొచ్చారు. సినిమా ఫ్లాపైతే చాలా బాధ పడతానని నా వల్లే డబ్బులు పోయాయని ఫ్లాప్ కు నేనే బాధ్యుడినని భావిస్తానని మహేష్ వెల్లడించారు. కథను నేను ఓకే చేసి ఉండకపోతే సినిమా ఫ్లాప్ కాదు కదా అనే చర్చ జరిగిందని మహేష్ బాబు పేర్కొన్నారు. కథల విషయంలో తుది నిర్ణయం తనదేనని మహేష్ వెల్లడించారు. ఫెయిల్యూర్స్ ను గుర్తిస్తే సక్సెస్ సాధిస్తామనేది నా ఫీలింగ్ అని మహేష్ పేర్కొన్నారు.
కథల విషయంలో బయటివాళ్లపై ఆధారపడనని నాన్నతో కూడా సినిమా కథలను డిస్కస్ చేయనని మహేష్ బాబు కామెంట్లు చేశారు. మహేష్ బాబు చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సినిమా ఫ్లాపైతే తనదే బాధ్యతని చెప్పిన విషయంలో మహేష్ గ్రేట్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Most Recommended Video
అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!