Mahesh Babu: మౌంటెన్ డ్యూ కోసం మహేష్ కు ఎంత ఇచ్చారంటే?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఎలాంటి యాడ్ చేసినా కూడా మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో ఫ్యాన్స్ కూడా స్టార్ హీరోల యాడ్స్ ను బాగానే వైరల్ చేస్తున్నారు. ఇక మహేష్ బాబు ఇటీవల మౌంటెన్ డ్యూ యాడ్ లో కనిపించాడు. ఆ యాడ్ హాలీవుడ్ రేంజ్ లో ఉండడంతో బాగానే పాపులర్ అయ్యింది. మహేష్ ఏకంగా బుర్జ్ ఖలీఫా నుంచి బైక్ స్టంట్ చేసినట్లుగా ఉండడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

Click Here To Watch

మొత్తానికి మహేష్ హాలీవుడ్ రేంజ్ లో ఉన్నట్లుగా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే ఈ యాడ్ కోసం మహేష్ మరోసారి భారీ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లగా తెలుస్తోంది. ప్రస్తుతం మహేష్ దజనుకు పైగా కంపెనిలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు. బాలీవుడ్ హీరోలతో సమానంగా మహేష్ రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు తెలుస్తోంది. బ్రాండ్స్ ఎండోర్స్ కోసం మహేష్ గతంలో 7కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటూ వచ్చాడు.

ఇక ఇప్పుడు మౌంటెన్ డ్యూ కోసం మాత్రం మహేష్ అత్యధికంగా 12కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. మౌంటెన్ డ్యూ కోసం మహేష్ మరిన్ని యాడ్స్ లో నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక కేవలం యాడ్స్ ద్వారానే మహేష్ ఏడాదికి వందల కోట్ల ఆదాయం అందుకుంటున్నట్లు సమాచారం. ఇక మహేష్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం సర్కారు వారి పాట ను ఫినిష్ చేసే పనిలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో కూడా మహేష్ ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆ సినిమా రెగ్యులర్ షూట్ త్వరలోనే మొదలు కానుంది. అలాగే మహేష్ రాజమౌళి దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేసేందుకు ఒప్పుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమా కూడా ఇదే ఏడాది సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉంది.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus