Mahesh Babu: స్టేజి పై డ్యాన్స్ చేయడానికి కారణాలు చెప్పిన మహేష్ …!

మహేష్ బాబుకి ఓ మాదిరి హిట్ ఇచ్చినా దర్శకుడిని ప్రేక్షకుల్ని తెగ పొగిడేస్తుంటాడు. అతని ఎక్సయిట్మెంట్ లెవల్స్ అన్ని ఫుల్ స్వింగ్ లో ఉంటాయి. ‘మహర్షి’ సినిమా సక్సెస్ మీట్లలో కాలర్ ఎగరేశాడు,దర్శకుడు వంశీ పైడిపల్లికి ముద్దు కూడా పెట్టాడు. ఇవి అప్పట్లో పెద్ద హాట్ టాపిక్ అయ్యాయి.ఎప్పుడు కామ్ గా ఉండే మహేష్ బాబు ఇంత ఎక్సయిట్ అయిపోయాడు ఏంటి అని జనాలు ఆ సినిమాని తెగ చూశారు.

ఇక ‘సరిలేరు నీకెవ్వరు’ సక్సెస్ మీట్లో కూడా దర్శకుడు అనిల్ రావిపూడిని హగ్ చేసుకుని తన ఆనందాన్ని బయటపెట్టాడు. ఆ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. ఇక తాజాగా ‘సర్కారు వారి పాట’ సక్సెస్ మీట్లో అయితే ఎన్నడూ లేని విధంగా స్టేజి ఎక్కి చిన్న స్టెప్పు కూడా వేశాడు. ఇది ముందే ప్లాన్ చేసిందా? అని మహేష్ బాబుని అడిగితే.. ‘ అది కచ్చితంగా చెప్పలేను. ఆ టైంకి అలా చేయాలనిపించింది.

2 ఏళ్ళుగా కోవిడ్ వల్ల ఇంట్లో కూర్చోవడం.. ఫ్యాన్స్ , సక్సెస్ మీట్ లు వంటి వాటికి దూరంగా ఉండడం.. పైగా సినిమా బాగా ఆడుతుంది ఇవన్నీ కలిసి అలా చేయడానికి కారణం అయ్యుండొచ్చు. నేను అలా స్టేజి పైకి వస్తున్నప్పుడు అక్కడ అందరూ షాక్ అయ్యారు.మా డైరెక్టర్ పరశురామ్ అయితే షాక్ అయిపోయి అలా చూస్తూనే ఉన్నాడు’ అంటూ పరశురామ్ ను ఇమిటేట్ చేస్తూ మరీ చెప్పుకొచ్చాడు మహేష్ బాబు.

ఇక ‘సర్కారు వారి పాట’ చిత్రానికి వస్తే తొలిరోజు మిక్స్డ్ టాక్ తో మొదలైన ఈ మూవీ.. బాక్సాఫీస్ రన్ ను మాత్రం డీసెంట్ గానే కొనసాగిస్తుంది. ఆల్రెడీ ఈ మూవీ రూ.100 కోట్ల షేర్ మార్క్ ను దాటేసింది. రెండో వీకెండ్ కూడా బాగా కలెక్ట్ చేస్తుంది అని ట్రేడ్ పండితులు అంచనాలు వేస్తున్నారు. కీర్తి సురేష్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించగా తమన్ అందించిన సంగీతం బాగా ప్లస్ అయ్యింది.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus