Mahesh Babu: ‘భీమ్లా నాయక్’ పై ప్రశంసలు కురిపించిన మహేష్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా హీరోలుగా నటించిన ‘భీమ్లా నాయక్’ చిత్రం నిన్న అంటే ఫిబ్రవరి 25న విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. సాగర్ చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ సంభాషణలు, స్క్రీన్ ప్లే అందించడం విశేషం. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మించాడు. తొలిరోజు ఈ చిత్రం ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ రికార్డ్ కలెక్షన్లను నమోదు చేసింది.

రెండో రోజు కూడా అదే ఊపుతో దూసుకుపోతుంది. ఈ చిత్రం ఫలితంతో అటు పవన్ కళ్యాణ్ అభిమానులు ఇటు రానా అభిమానులు ఇద్దరూ ఆనందం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. సెలబ్రిటీలు కూడా ఈ చిత్రం అద్భుతం అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న సందర్భాలను కూడా మనం చూస్తూ వస్తున్నాం. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు.. ‘భీమ్లా నాయక్’ ను వీక్షించి ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని తెలియజేసాడు.

” ‘భీమ్లా నాయక్’ చించేసింది… అదరగొట్టేసింది. చూస్తున్నంత సేపు ఉత్కంఠతను రేకెత్తించింది. పవన్ కళ్యాణ్ నటనలో మరోసారి ఫైర్ కనిపించింది. ఆయన చాలా అద్భుతంగా నటించాడు. రానా.. కూడా డానియల్ శేఖర్ గా అదరగొట్టాడు. అతని స్క్రీన్ ప్రెజెన్స్ కూడా సూపర్ గా ఉంది. రవి కె చంద్రన్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. నాకు చాలా ఇష్టమైన కెమెరామెన్ లలో ఈయన కూడా ఒకరు. తమన్ తన సంగీతంతో సినిమాని మరో స్థాయిలో నిలబెట్టాడు.

త్రివిక్రమ్ తన తెలివికి బాగా పదును పెట్టి అద్భుతంగా కథని రాసారు. దర్శకుడు సాగర్ చంద్ర, సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగ వంశీలకి అలాగే ‘భీమ్లా నాయక్’ టీం అందరికీ నా హృదయపూర్వక అభినందనలు” అంటూ చెప్పుకొచ్చారు.

భీమ్లా నాయక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ తో పాటు పవన్ హీరోగా రీమేక్ అయిన 12 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus