Mahesh Babu, Rajamouli: రాజమౌళి మూవీలో మహేష్ బాబు రోల్ అలా ఉండబోతుందా?

మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాపై ఆకాశమే హద్దుగా అంచనాలు పెరుగుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ కు సంబంధించి కూడా ఆసక్తికర అప్ డేట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే ఈ సినిమాలో మహేష్ బాబు రోల్ కు సంబంధించి ఒక విషయం నెట్టింట వైరల్ అవుతోంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం మహేష్ బాబు ఈ సినిమాలో ఇప్పటివరకు పోషించని రోల్ ను పోషిస్తున్నారని తెలుస్తోంది.

మహేష్ బాబు పాత్రకు సంబంధించి మస్తు షేడ్స్ ఉంటాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. మహేష్ బాబు పాత్ర ఇంటెన్సిటీతో ఉంటుందని భోగట్టా. మహేష్ కెరీర్ లో ఈ రోల్ స్పెషల్ గా ఉండబోతుందని ఆడియన్స్ సైతం ఆశ్చర్యపోయేలా మహేష్ బాబు రోల్ ను క్రియేట్ చేశారని సమాచారం అందుతోంది. మహేష్ బాబు ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ లా ఈ సినిమా ఉండబోతుందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.

మహేష్ రాజమౌళి కాంబో మూవీలో హీరోయిన్ గా ఇండోనేషియా బ్యూటీ నటిస్తారని త్వరలో హీరోయిన్ కు సంబంధించిన పూర్తి వివరాలను సైతం అధికారికంగా వెల్లడించనున్నారని తెలుస్తోంది. మహేష్ రాజమౌళి కాంబో మూవీ ఎస్.గోపాల్ రెడ్డి, కేఎల్ నారాయణ నిర్మాతలుగా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండటం గమనార్హం. మహేష్ జక్కన్న నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారని తెలుస్తోంది.

రాజమౌళి బాహుబలి2 సినిమాను మించిన స్క్రిప్ట్ ను ఈ సినిమా కోసం ఎంచుకున్నారని సమాచారం అందుతోంది. రాజమౌళి వైవిధ్యమైన కథ, కథనం ఉన్న సినిమాలకు ప్రాధాన్యత ఇస్తుండగా రాబోయే రోజుల్లో జక్కన్నకు మరిన్ని భారీ విజయాలు సొంతమయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మహేష్ బాబు (Mahesh Babu) ఈ సినిమాలో సరికొత్త లుక్ లో కనిపించనున్నారని తెలుస్తోంది.

భామా కలాపం 2 సినిమా రివ్యూ & రేటింగ్!

భ్రమయుగం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజధాని ఫైల్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus