సినిమా థియేటర్లు మూత పడడంతో ఓటీటీ కంపెనీలు ఆఫర్స్ తో ఎర వేయడం స్టార్ట్ చేశాయి. భవిష్యత్తులో థియేటర్స్ బిజినెస్ పడిపోయే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే ఓటీటీ సంస్థలు కొంతవరకు హింట్ ఇచ్చేశాయి. అన్ని సినిమాలు థియేటర్స్ లో అడలేవని కూడా అర్ధమయ్యింది. ఇక సెకండ్ వేవ్ లో విడుదలకు నోచుకోని సినిమాలపై బడా కంపెనీలు ఫోకస్ పెట్టాయి. ప్రస్తుతం అందరి చూపు మేజర్ సినిమాపైనే ఉంది. ముంబై ఉగ్ర దాడుల్లో మరణించిన మేజర్ ఉన్ని కృష్ణన్ జీవిత ఆధారంగా తెరకెక్కిన ఆ సినిమాలో అడివి శేష్ నటించిన విషయం తెలిసిందే.
శశి కిరణ్ టిక్కా దర్శకత్వం వహించగా సోని పిక్చర్స్ తో కలిసి మహేష్ బాబు GMB ప్రొడక్షన్ సంయుక్తంగా నిర్మించింది. ఇక సినిమాకు ఇటీవల నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్ నుంచి భారీ ఆఫర్స్ వచ్చినట్లు సమాచారం. ఇదివరకే ఆమెజాన్ ప్రైమ్ ప్రయత్నం చేసి డ్రాప్ అయ్యింది. ఇక బడ్జెట్ కంటే మరో 5కోట్లు ప్రాఫిట్స్ వచ్చేలా ఆఫర్ ఇచ్చినప్పటికీ నిర్మాతలు ఒప్పుకోవడం లేదట. ముఖ్యంగా. మహేష్ బాబు ఓటీటీ అనే ఆలోచనలోనే ఉండడం లేదట. థియేటర్స్ లోనే విడుదల చేయాలని మైండ్ లో ఫిక్స్ అయ్యారట.
నెట్ ఫ్లిక్స్ వాళ్లే ఎక్కువగా ట్రై చేస్తున్నట్లు సమాచారం. గతంలో ఓటీటీ అనే పేరు వింటేనే కోపానికి వచ్చినవారు మళ్ళీ ఎక్కడో ఒక చోట ఆఫర్స్ కు లొంగక తప్పలేదు. అదే తరహాలో మేజర్ టీమ్ దొరక్కపోదా అని ప్రయత్నం చేస్తున్నారట. మరి మేజర్ టీమ్ ఎప్పటివరకు వేయిట్ చేస్తుందో చూడాలి.
Most Recommended Video
ఏక్ మినీ కథ సినిమా రివ్యూ & రేటింగ్!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!