Mahesh Babu: శ్రీ లీల డాన్స్ పెర్ఫార్మెన్స్ పొగడ్తల వర్షం కురిపించిన మహేష్?

గుంటూరు కారం సినిమా ప్రీ రిలీజ్ వేడుక గుంటూరులో ఎంతో ఘనంగా జరిగిన సంగతి మనకు తెలిసిందే. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహేష్ బాబు అభిమానులు చేరుకున్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా మహేష్ బాబు సినిమా గురించి అలాగే తన తల్లిదండ్రులను కూడా గుర్తుచేసుకొని ఎమోషనల్ అయ్యారు. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా మహేష్ బాబు హీరోయిన్ శ్రీల గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

సాధారణంగా మహేష్ బాబు తన సినిమా హీరోయిన్ల గురించి పెద్దగా మాట్లాడారు కానీ శ్రీ లీల గురించి మాత్రం మహేష్ బాబు మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. చాలా రోజుల తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలోకి మరొక తెలుగమ్మాయి రావటం చాలా సంతోషంగా అనిపించిందని ఈయన తెలియజేశారు. శ్రీ లీల చాలా హార్డ్ వర్క్ అని తన షూటింగ్ పూర్తి అవ్వగానే వెళ్లి కారవాన్ లో కూర్చోకుండా అక్కడే ఉంటూ అందరినీ సపోర్ట్ చేస్తూ ఉంటారని మహేష్ బాబు తెలిపారు.

ఇక ఈమె లాంటి ఒక టాలెంటెడ్ హీరోయిన్ ని ఎంపిక చేసినందుకు మా టీంకు ధన్యవాదాలు అంటూ మహేష్ బాబు తెలియజేశారు. ఇక శ్రీ లీల డాన్స్ పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుతూ ఈయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ అమ్మాయితో డాన్స్ చేయడం అంటే మామూలు విషయం కాదు వామ్మో అదేం డాన్స్ చేయడం అంటూ శ్రీ లీల డాన్స్ పెర్ఫార్మెన్స్ పై ప్రశంసలు కురిపించారు.

శ్రీ లీలతో డాన్స్ చేయాలి అంటే హీరోల తాట ఊడిపోతుంది అంటూ ఈయన బోల్డ్ కామెంట్స్ చేశారు. తాను ఇలాగే చేస్తూ ఉండాలని తనకు మంచి భవిష్యత్తు ఉంది అంటూ ఈ సందర్భంగా శ్రీ లీల డాన్స్ పెర్ఫార్మెన్స్ గురించి ఆమె నటన గురించి మహేష్ బాబు చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇలా ఏ హీరోయిన్ విషయంలోనూ ఎప్పుడు మాట్లాడని మహేష్ (Mahesh Babu) శ్రీ లీల విషయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus