మహాప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలు జరగగా మహేష్ సొంత స్థలంలో అంత్యక్రియలను జరిపి ఉంటే బాగుండేదని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. అయితే స్మశానంలో అంత్యక్రియలు జరపడం ద్వారా స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని కుటుంబ ఆచారాల ప్రకారం మహేష్ బాబు ఈ విధంగా చేసి ఉండవచ్చని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. తన సినీ కెరీర్ లో కృష్ణ 350కు పైగా సినిమాలలో నటించారు. కృష్ణ వల్ల ఎంతోమందికి మేలు జరిగింది.
ఎంత ఎదిగినా ఒదిగి ఉండే కృష్ణ ఎంతోమందికి తన వంతు సహాయాలు చేసి వార్తల్లో నిలిచారు. ఈ జనరేషన్ లో కూడా కోట్ల సంఖ్యలో అభిమానులు కృష్ణను అభిమానిస్తున్నారు. కృష్ణ మెమోరియల్ ను ఏర్పాటు చేస్తే బాగుంటుందని మహేష్ బాబు భావిస్తున్నారని సమాచారం అందుతోంది. కృష్ణ ఫోటోలను, ఆయన అవార్డులను, ప్రత్యేకమైన జ్ఞాపకాలను ఈ మెమోరియల్ లో ఉంచనున్నారని తెలుస్తోంది. కృష్ణ మెమోరియల్ ను ఏర్పాటు చేసి తర్వాత తరాలకు కూడా కృష్ణ గొప్పదనం తెలిసేలా చేయాలని మహేష్ బాబు ఆలోచిస్తున్నారు.
ఈ ఆలోచన నిజమైతే మహేష్ బాబు అభిమానులు సైతం ఎంతగానో సంతోషిస్తారని కచ్చితంగా చెప్పవచ్చు. తండ్రి మరణం మహేష్ బాబును ఎంతో బాధ పెట్టగా ఆ బాధ నుంచి మహేష్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. కుటుంబ సభ్యులకు ఎలాంటి సమస్యలు రాకుండా మహేష్ కీలక నిర్ణయాలు తీసుకోనున్నారని తెలుస్తోంది. వరుస విషాదాలు మనస్సును ఎంతగానో బాధ పెట్టినా మహేష్ బాబు కుటుంబ సభ్యులకు అండగా నిలవాల్సి ఉంది.
వయస్సులో మహేష్ బాబు చిన్నవాడైనా ఆయనపై ప్రస్తుతం ఎన్నో బరువుబాధ్యతలు ఉన్నాయి. మరో నెలరోజుల పాటు మహేష్ బాబు షూటింగ్ లకు హాజరయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ షూట్ వచ్చే ఏడాది మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.
యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?
‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!