Mahesh Babu: ఆ ఒక్క టిప్ పాటిస్తే భార్యలను ఈజీగా మేనేజ్ చేయొచ్చు: మహేష్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా యానిమల్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో సందడి చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన యానిమల్ సినిమా గురించి చేసినటువంటి కామెంట్స్ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేశాయి. ఇక ఎప్పుడు తన సినిమాలకు కూడా స్టేజ్ పై డాన్స్ చేయనటువంటి మహేష్ బాబు అనిల్ కపూర్ పిలుపుమేరకు ఈ సినిమా వేదికపై అద్భుతమైనటువంటి డాన్స్ పెర్ఫార్మెన్స్ చేశారు.

ఇలా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎంతో సందడి చేస్తున్నటువంటి ఈయనను రిపోర్టర్ పలు ప్రశ్నలు వేసి ఆసక్తికరమైనటువంటి సమాధానాలను రాబడతారు ఈ సందర్భంగా రిపోర్టర్స్ ప్రశ్నిస్తూ కృష్ణ గారు మీపై కోపడినటువంటి సందర్భాలు ఉన్నాయా అని అడిగారు ఈ ప్రశ్నకు మహేష్ బాబు అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయని తెలిపారు కానీ ఈ సినిమాలో ఫాదర్ అండ్ సన్ రిలేషన్ మాదిరి రియల్ లైఫ్ లో చూడలేదని తెలిపారు.

ఇకపోతే భార్యలను మేనేజ్ చేయడానికి మీ దగ్గర ఏమైనా టిప్స్ ఉంటే చెబుతారా అంటూ కూడా ప్రశ్నలు వేశారు. ఈ ప్రశ్నకు మహేష్ బాబు చెప్పినటువంటి సమాధానం ప్రస్తుతం సంచలనగా మారింది భార్యలను మేనేజ్ చేయాలి అంటే ఎప్పుడు నవ్వుతూ ఉండాలి ఏ సందర్భంలోనైనా మనం నవ్వుతూ ఉంటే వాళ్లను ఈజీగా మేనేజ్ చేయవచ్చని ఇంతకుమించి వేరే దారి లేదని మహేష్ బాబు ఈ సందర్భంగా సమాధానం చెప్పారు.

ఇలా మహేష్ బాబు (Mahesh Babu) భార్యలను మేనేజ్ చేయడం గురించి సమాధానం చెప్పడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బహుశా నమ్రతను కూడా మహేష్ బాబు తన నవ్వుతోనే పడగొట్టేసారేమోనని ఈయన నవ్వితే చాలు ఆమె కూల్ అవుతారని ఈ సందర్భంగా నేటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన గుంటూరు కారం సినిమా పనులలో ఉన్నారు. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు రాజమౌళి సినిమాలలో కూడా బిజీ కాబోతున్నారు.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus