Mahesh Babu Son Gautam: మహేష్ కొడుకు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేది అప్పుడేనా.. ఏమైందంటే?

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కెరీర్ పరంగా వరుస విజయాలతో సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. మహేష్ రాజమౌళి (S. S. Rajamouli)  కాంబో మూవీ షూట్ త్వరలో మొదలుకానుండగా 1000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. రాజమౌళి మహేష్ బాబును ఈ సినిమాలో కొత్తగా చూపించనున్నారని సమాచారం అందుతోంది. మరోవైపు మహేష్ బాబు కొడుకు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం కోసం అమెరికాలో ట్రైనింగ్ తీసుకుంటున్నారని తెలుస్తోంది.

గౌతమ్ ఇప్పటికే చదువుకు సంబంధించి ప్లస్ 2 పూర్తి చేయగా అమెరికాలో త్వరలో బ్యాచులర్ డిగ్రీ కోర్సులో జాయిన్ కాబోతున్నారు. అదే సమయంలో న్యూయార్క్ లోని ప్రఖ్యాత ఫైల్మ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో శిక్షణ తీసుకుంటున్నారని భోగట్టా. మరో ఐదేళ్ల తర్వాత మాత్రమే గౌతమ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. మహేష్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.

మహేష్ గౌతమ్ ను ఒకే ఫ్రేమ్ లో చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 1 నేనొక్కడినే సినిమాలో గౌతమ్ కూడా నటించినా మహేష్ గౌతమ్ కాంబో సన్నివేశాలు లేకపోవడం గమనార్హం. గౌతమ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తే కచ్చితంగా ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మహేష్ రెమ్యునరేషన్ ఒకింత భారీ స్థాయిలో ఉండటం గమనార్హం.

సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి సినిమాతో పాన్ వరల్డ్ స్థాయిలో సక్సెస్ సాధించడం ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి. రాజమౌళి మహేష్ బాబు కోసం అద్భుతమైన స్క్రిప్ట్ ను సిద్ధం చేశారని భోగట్టా. ఈ సినిమాలో నటించే నటీనటులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మహేష్ బాబు కెరీర్ ను నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేసుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. మహేష్ లుక్స్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus