Mahesh Babu: ఆధార్ వెరిఫికేషన్ ఆఫీస్‌‌లో మషేష్ బాబు.. వీడియో వైరల్..!

సూపర్ స్టార్ మహేష్ బాబు ఆధార్ వెరిఫికేషన్ ఆఫీస్‌‌లో సందడి చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. గవర్నమెంట్‌తో పని అంటే..సెలబ్రిటీలైనా, సామాన్యులైనా ఎవరికైనా ఒకటే రూల్స్.. ఓటు వెయ్యాలంటే అందరిలానే క్యూలో నిలబడాలి.. డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ అయినా, కార్ నెంబర్ కోసమైనా, స్థలాలు, పొలాలు, ఫ్లాట్స్ రిజిస్ట్రేషన్.. ఇలా సర్కారుతో పని పడిందంటే.. స్టార్ హోదా పక్కన పెట్టాల్సిందే..

మన దగ్గరంటే అధికారులు అతిథి మర్యాదలు చేస్తారు కానీ.. తమిళనాట అజిత్.. తమ పిల్లల స్కూల్ సీటు దగ్గరి నుండి ఓటు వేసే వరకు అన్ని విషయాల్లోనూ స్టార్‌లా కాకుండా సింపుల్‌గా ఉంటారు అని అంటుంటారు కానీ.. సూపర్ స్టార్ మహేష్ కూడా అందరిలానే సామాన్యుడిలా ఆధార్ వెరిఫికేషన్ కోసం వెళ్లారు. ఐ టెస్ట్ వంటి ఫార్మాలిటీస్ కంప్లీట్ చేశారు.

దీన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. వైరల్‌గా మారింది.. ఇక కింద కామెంట్స్ చూస్తే మామూలు ఫన్నీగా లేవసలు.. ‘అడ్రెస్ పాన్ వరల్డ్‌గా మార్చమని చెప్పు బ్రో.. ఆధార్ కార్డులో మహేష్ బాబు అయినా అందంగా పడతాడంటావా బ్రో’.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus