ఎన్నారై లతో కలిసి సాయం చేస్తున్న మహేష్

సూపర్ స్టార్ మహేష్ బాబు మంచి నటుడు మాత్రమే కాదు.. మంచి మనసున్న మనిషి అని అనేక సార్లు నిరూపించుకున్నారు. మూడో కంటికి తెలియకుండా అయన ఎంతోమందికి సాయం చేశారు. రెండు గ్రామాలను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తున్నారు. తాజాగా మరో సాయం చేశారు. ఎన్నారై సేవ పేరుతో కొంతమంది ఎన్నారై లు ప్రతిరోజు మురికి వాడలకి వెళ్లి అక్కడ రోగాలతో బాధపడుతున్న వారికీ ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్నారు. ఇలా ప్రతి రోజూ 150 మందికి చికిత్స అందిస్తున్నారు. ఈ కార్యక్రమం గత ఆరేళ్లుగా నిర్విరామంగా కొనసాగుతోంది. వీరి సేవ దృక్పథం మహేష్ బాబుని ఆకర్షించింది.

అందుకే ఆ ఫౌండేషన్ అథ్లెటిక్స్ కోసం అండగా నిలవాలనుకుంటే.. అందుకోసం అయ్యే మొత్తాన్ని భరించడానికి మహేష్, నమ్రతలు ఒకే చెప్పారు. ఫ్రీ స్పోర్ట్స్ రీహాబ్ ప్రోగ్రాం కి స్పాన్సర్ గా వ్యవహరించారు. దీని గురించి ఎన్నారై సేవ ఫౌండేషన్ ప్రతినిధి హరీష్ మాట్లాడుతూ.. “కొన్ని నెలలుగా మహేష్, నమ్రత మాకు ఎంతో అండగా ఉన్నారు. అయితే ఈ విషయాన్నీ భరత్ అనే నేను సినిమా రిలీజ్ సమయంలో బయటికి చెప్పవద్దని నాతో చెప్పారు. ఆ మాటలోనే వారి మనసు నాకు అర్ధమయింది. చేసిన సాయం గురించి గొప్పలు చెప్పుకోవడం.. వాటిని తమ సినిమా ప్రమోషన్ కి వాడుకోవడం వారికి నచ్చదని ఈ సంఘటన స్పష్టం చేసింది. అయినా మంచి చేసిన వారి గురించి చెప్పకపోతే నాకు సంతృప్తి ఉండదు. అందుకే బయటపెట్టాను” అని వివరించారు. మహేష్ మా ఫౌండేషన్ కి అండగా నిలవడం గర్వంగా ఉందని అన్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus