Mahesh Babu: కరోనా భారిన పడ్డ మహేష్.. ఫ్యాన్స్ లో ఆందోళన..!

  • January 6, 2022 / 09:03 PM IST

దేశంలో కరోనా కేసులు భారీ ఎత్తున పెరుగుతున్నాయి. బుధవారం నాడు ఏకంగా 90 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. ఏకంగా 325 మంది మరణించారు. చూస్తుంటే థర్డ్ వేవ్ మొదలయ్యిందనే సంకేతాలు అందుతున్నాయి. సామాన్యులు మాత్రమే కాదు సినీ ప్రముఖులు సైతం కోవిడ్ బారిన పడుతుండడం ఆందోళన కలిగించే అంశం. కొన్ని గంటల ముందు మంచు లక్ష్మీ కరోనా భారిన పడినట్టు వెల్లడించిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు మహేష్ బాబు కూడా కరోనా భారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా మహేష్ బాబే తన ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ‘నేను కోవిడ్ భారిన పడకుండా ఉండేందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాను. అయినప్పటికీ దాని భారి నుండీ తప్పించుకోలేకపోయాను.జలుబు వంటి స్వల్ప లక్షణాలు ఉండడంతో కోవిడ్ టెస్ట్ చేయించుకోగా రిపోర్ట్స్ లో పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం వైద్య నిపుణుల సమక్షంలో హోమ్ ఐసోలేషన్లో ఉంటున్నాను.

ఇటీవల నన్ను కలిసిన వారంతా కోవిడ్ టెస్ట్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను’ అంటూ మహేష్ పేర్కొన్నాడు. కొద్దిరోజుల క్రితం మహేష్ బాబు యూరప్ లో తన కాలికి సర్జరీ చేయించుకుని.. దుబాయ్ లో విశ్రాంతి తీసుకుంటూ వచ్చాడు. ఆ టైములో మహేష్ ను త్రివిక్రమ్, నిర్మాత సూర్యదేవర నాగవంశీ వంటి వారు వెళ్ళి కలిశారు.

దీనికి సంబంధించిన ఫోటోలు కూడా బయటకి వచ్చాయి. ఏదేమైనా మహేష్.. అభిమానుల్లో ఇప్పుడు ఆందోళన నెలకొంది. ఆయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus