మహేష్, కృష్ణ వారసత్వంతో పాటు కుటుంబ బాధ్యతలు కూడా తీసుకోవాల్సిన టైం వచ్చిందా..!

సూపర్ స్టార్ కృష్ణ నుండి నట వారసత్వంతో పాటు కుటుంబ బాధ్యతల్ని కూడా తీసుకునే టైం వచ్చింది మహేష్ బాబుకి.. నటుడిగా తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుని.. ప్రిన్స్, సూపర్ స్టార్‌గా ప్రేక్షకాభిమానులను సంపాదించుకున్నాడు మహేష్.. ఈ ఏడాది జనవరిలో అన్నయ్య రమేష్ బాబు, సెప్టెంబర్‌లో అమ్మ ఇందిరా దేవి, నవంబర్‌లో నాన్న.. ఇలా ముగ్గుర్ని కోల్పోవడంతో తను తీవ్ర విషాదంలో మునిగిపోయాడు. సూపర్ స్టార్ కృష్ణ అకాల మరణం అందర్నీ షాక్‌కి గురిచేసింది..

ఇప్పటికీ ఈ విషయాన్ని తెలుగు ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు.. అభిమానుల సంగతి అయితే చెప్పక్కర్లేదు. కృష్ణ గారి వీరాభిమానులు, సీనియర్ ఫ్యాన్స్ అయితే గుండెలవిసేలా రోదించడం చూసి అంతా భావోద్వేగానికి గురయ్యారు. ఇదిలా ఉంటే ఇప్పుడు మహేష్ బాబు తన కుటుంబంతో పాటు అన్నయ్య రమేష్ బాబు కుటుంబ బాధ్యతలు కూడా చూసుకోవాల్సిన టైం వచ్చింది.. రమేష్ బాబు మరణంతో ఆయన భార్య మృదుల ఒంటరైపోయారు. ప్రస్తుతం తన ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటున్నారామె..

ఆమధ్య కొడుకు జయకృష్ణ ధోతీ ఫంక్షన్ తాలుకు పిక్స్ బయటకి వచ్చినప్పుడు తప్ప రమేష్ బాబు ఫ్యామిలీ ఎక్కడా పెద్దగా ఫోకస్ కాలేదు. రమేష్ బాబు అకాల మరణం.. పిల్లలు చిన్నవాళ్లు కావడంతో.. ఇంటి పెద్ద స్థానంలో అన్నయ్య పిల్లల బాధ్యతను కూడా మహేష్ బాబే తీసుకోవాలి. జయకృష్ణ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి అమెరికాలో ట్రైనింగ్ అవుతుండగా.. కుమార్తె భారతి చదువుకుంటోంది.. వాళ్ల భవిష్యత్తు, పెళ్లిళ్లు లాంటి వ్యవహారలన్నీ బాబాయే చూసుకోవాలి..

నవంబర్ 17న కృష్ణ గారి చిన్నకర్మ కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేశారు కుటుంబ సభ్యులు.. త్వరలో హైదరాబాద్‌లో కృష్ణ మెమోరియల్ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. అందులో కృష్ణ సినిమాలకు సంబంధించిన ఫొటో గ్యాలరీ, అవార్డ్స్‌తో పాటు ఆయనకు సంబంధించిన జ్ఞాపకాలన్నిటినీ భద్రంగా ఉంచబోతున్నారు. ఏదేమైనా మహేష్ వీలైనంత త్వరగా ఈ బాధ నుండి బయటపడి మునుపటిలా హుషారుగా కనిపించాలని కోరుకుంటూ.. కృష్ణ గారికి నివాళి అర్పిస్తున్నారు ఘట్టమనేని అభిమానులు..

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus