‘అర్జున్ రెడ్డి’ డైరెక్టర్ తో మహేష్.. మరి రాజమౌళి సంగతేంటి…?

ఈ ఏడాది ‘సరిలేరు నీకెవ్వరు’ తో బ్లాక్ బస్టర్ అందుకున్న మహేష్ తన తరువాతి సినిమాని వంశీ పైడిపల్లి డైరెక్షన్లో చంయబోతున్నట్టు తెలిపిన సంగతి తెలిసిందే. గతేడాది వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘మహర్షి’ చిత్రం మంచి హిట్టయ్యింది. దాంతో వెంటనే మహేష్ మరో చిత్రం చెయ్యడానికి రెడీ అయ్యాడు.కానీ వంశీ రెడీ చేసిన స్క్రిప్ట్ మహేష్ కు నచ్చలేదు. దీంతో ఆ ప్రాజెక్ట్ ను హోల్డ్ లో పెట్టాడు. ఇప్పుడు ‘గీత గోవిందం’ దర్శకుడు పరశురామ్ తో మహేష్ సినిమా ఉండబోతుంది. అయితే ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు ఈ ప్రాజెక్ట్ ను నిర్మించనున్నారు. ’14 రీల్స్’ వారు కూడా సహానిర్మతలుగా వ్యవహరించే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే.. ‘ఆర్.ఆర్.ఆర్’ పూర్తయిన వెంటనే మహేష్ తో తన సినిమా ఉంటుందని స్వయంగా రాజమౌళి ప్రకటించాడు. ‘శ్రీ దుర్గా ఆర్ట్స్’ అధినేత కె.ఎల్.నారాయణ్ గారు ఈ ప్రాజెక్ట్ ను నిర్మించనున్నారు. అయితే ‘ఆర్.ఆర్.ఆర్’ పూర్థయ్యి మహేష్ తో చేయబోయే స్క్రిప్ట్ ను రెడీ చెయ్యాలి అంటే.. మరో 2 సంవత్సరాలు అయినా పడుతుంది. దీంతో మహేష్ మరో రెండు ప్రాజెక్ట్ లు ఫినిష్ చెయ్యాలి అని చూస్తున్నాడు అని తెలుస్తోంది. ఈ క్రమంలో తాజాగా తన దగ్గర మహేష్ కు సూట్ అయ్యే స్క్రిప్ట్ ఉందని ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి మహేష్ ను సంప్రదించగా… తీసుకురమ్మని మహేష్ చెప్పాడట. మరో రెండు, మూడు రోజుల్లో మహేష్ కు సందీప్ కథ వినిపిస్తాడు అని తెలుస్తుంది.

మహేష్ కు కనుక సందీప్ స్క్రిప్ట్ నచ్చితే వెంటనే.. దానిని కూడా ఓకే చేసే అవకాశం ఉందని తాజా సమాచారం. ఒక వేళ సందీప్ స్క్రిప్ట్ నచ్చకపోతే త్రివిక్రమ్ కూడా మహేష్ కోసం ఓ స్క్రిప్ట్ అనుకున్నాడట. మహేష్ కు నచ్చితే దానిని కూడా ఓకే చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.ఏదేమైనా రాజమౌళి సినిమా సెట్స్ పైకి వెళ్ళే లోపు వరుస సినిమాలు చెయ్యాలి అని మహేష్ డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. మరి ఎంత వరకూ వర్కౌట్ అవుతుందో చూద్దాం.

Most Recommended Video

‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
పోకిరి స్టోరీకి మహేష్ చెప్పిన చేంజెస్ అవే..!
హీరోయిన్స్ గా ఎదిగిన హీరోయిన్స్ కూతుళ్లు వీరే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus