మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఆగష్టు నెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలుకానుండగా 2023 సంవత్సరం సమ్మర్ కానుకగా ఈ సినిమా విడుదల కానుంది. త్రివిక్రమ్ పొలిటికల్ కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. ప్రస్తుత కాలంలో రాజకీయం బిజినెస్ గా ఎలా మారిందనే విషయాలను ఈ సినిమాలో చర్చించనున్నారని తెలుస్తోంది. యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుంది.
అతడు, ఖలేజా సినిమాల తర్వాత మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండనుందని తెలుస్తోంది. సినిమాలోని మెజారిటీ సన్నివేశాలు ప్రాక్టికల్ గా ఉంటాయని ఏ రాజకీయ పార్టీని టార్గెట్ చేయకుండానే రాజకీయ నాయకులు ఏ విధంగా మారితే ప్రజలకు మంచి జరుగుతుందో ఈ సినిమాలో చర్చించనున్నారని తెలుస్తోంది. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై అల వైకుంఠపురములో సినిమా తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం.
ఖర్చు విషయంలో రాజీ పడకుండా మేకర్స్ ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే కథతో దర్శకుడు ఈ సినిమా స్క్రిప్ట్ ను సిద్ధం చేశారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం. మహేష్, త్రివిక్రమ్ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా సక్సెస్ లను అందుకుంటామని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఈ సినిమాకు మహేష్ రెమ్యునరేషన్ 70 కోట్ల రూపాయలు అని త్రివిక్రమ్ రెమ్యునరేషన్ 30 కోట్ల రూపాయలు అని సమాచారం.
దాదాపుగా 200 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుండగా బ్లాక్ బస్టర్ టాక్ వస్తే మాత్రమే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉంటుంది. మహేష్ తర్వాత ప్రాజెక్ట్ లతో ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాల్సి ఉంది. మహేష్ కు జోడీగా ఈ సినిమాలో పూజా హెగ్డే నటిస్తున్నారు.
Most Recommended Video
టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!