SSMB28: మహేష్ – త్రివిక్రమ్ సినిమా పై క్లారిటీ వచ్చేసింది..!

‘సర్కారు వారి పాట’ సినిమా తర్వాత మహేష్ బాబు… మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. నిజానికి 2021 ఎండింగ్ లో ఈ చిత్రం ప్రారంభం అవుతుంది అన్నారు. కానీ 2022 ఫస్టాఫ్ పూర్తయినా ఇంకా షూటింగ్ ప్రారంభం కాలేదు. అసలు ఈ సినిమా ఉంటుందా.. ఉండదా అనే అనుమానాలు అటు అభిమానుల్లోనూ ఇటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ ఏర్పడ్డాయి. వాటికి ఫుల్ స్టాప్ పెట్టడానికి ఈరోజు నిర్మాతలైన ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ వారు అధికారిక ప్రకటన ఇచ్చారు.

ఆగష్టు నెల నుండి ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం అవుతుంది అని ప్రకటించారు. అంతేకాదు 2023 సమ్మర్ కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు కూడా వెల్లడించారు. అంతా బాగానే ఉంది కానీ… ఒకసారి స్క్రిప్ట్ లాక్ అయితే ఈ చిత్రాన్ని త్రివిక్రమ్ 4 నెలల్లో కంప్లీట్ చేసేలా ప్లాన్ చేసుకున్నాడు. దీంతో 2023 సంక్రాంతికే ఈ చిత్రాన్ని విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఆగస్టు నుండి షూటింగ్ ప్రారంభిస్తే సంక్రాంతికి హ్యాపీ గా రిలీజ్ చేసుకోవచ్చు. కానీ 2023 సమ్మర్ వరకు వెళ్లడం అనేది కాస్త ఆలోచించాల్సిన విషయం.

మహేష్ ను ఈ మధ్యనే కలిసి ఫుల్ స్క్రిప్ట్ వినిపించాడు త్రివిక్రమ్. కానీ మహేష్ ఇంకా మార్పులు కోరాడు. అతనికి కథ నచ్చింది కానీ బౌండ్ స్క్రిప్ట్ రెడీ అయ్యాక కానీ సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచనలో లేడు. ‘స్పైడర్’ తర్వాత మహేష్ బౌండ్ స్క్రిప్ట్ తో వచ్చిన దర్శకులకే ఛాన్స్ ఇస్తున్నాడు. ఆ డైరెక్టర్ కు స్టార్ డం ఉందా లేదా అన్నది చూడటం లేదు. స్క్రిప్ట్ రెడీగా ఉండి.. తన బాడీ లాంగ్వేజ్ కు అది మ్యాచ్ అవుతుంది అనుకుంటే చాలు ఛాన్స్ ఇచ్చేస్తున్నాడు.

త్రివిక్రమ్ విషయంలో కూడా ఇప్పుడు అదే చేస్తున్నాడు. అయితే ఈ మధ్య కాలంలో త్రివిక్రమ్ కథ రెడీ చేసుకుని సెట్స్ పైకి వెళ్లిన తర్వాత స్క్రిప్ట్ ను మరింత డెవలప్ చేసుకోవడం అలవాటు చేసుకున్నాడు. మహేష్ కి వచ్చేసరికి ఇప్పుడు కొత్తగా చేయడం అనేది త్రివిక్రమ్ కు కాస్త ఇబ్బందిగా మారింది అనేది ఇండస్ట్రీ టాక్. ఆగష్ట్ లో కూడా సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంది అనేది డౌటే అని కూడా సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకే సేఫ్ సైడ్ కి 2023 లో రిలీజ్ అని ప్రకటించారు.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus