Mahesh Babu, Trivikram: మహేష్ త్రివిక్రమ్ మూవీ షూట్ మొదలయ్యేది అప్పుడేనా?

సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు మహేష్ బాబు వరుసగా నాలుగు విజయాలను సొంతం చేసుకోవడంతో చాలా సంతోషిస్తున్నారు. భరత్ అనే నేను సినిమా నుంచి సర్కారు వారి పాట సినిమా వరకు మహేష్ ప్రతి సినిమా భారీ కలెక్షన్లను సాధించింది. సర్కారు వారి పాట పలు ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కాకపోయినా ఈ సినిమా వల్ల నిర్మాతలకు భారీస్థాయిలో లాభాలు మిగిలాయని తెలుస్తోంది. మహేష్ తర్వాత సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.

పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంపిక కాగా థమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం త్రివిక్రమ్ మహేష్ ను జర్మనీలో కలిసి ఈ సినిమా ఫైనల్ స్క్రిప్ట్ ను వినిపించారు. అయితే కథ విన్న మహేష్ బాబు స్టోరీ సూపర్ గా ఉందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని సమాచారం అందుతోంది. జులై 2వ వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుందని బోగట్టా. 2023 సంవత్సరం సంక్రాంతి టార్గెట్ గా ఈ సినిమా షూటింగ్ జరగనుందని తెలుస్తోంది.

థమన్ ఇప్పటికే మ్యూజిక్ కు సంబంధించిన పనులను మొదలుపెట్టారని సమాచారం. అటు మహేష్ అభిమానులను ఇటు త్రివిక్రమ్ అభిమానులను మెప్పించే విధంగా ఈ సినిమా ఉండనుందని సమాచారం. మహేష్ కు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇవ్వాలని త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని సమాచారం అందుతోంది. దాదాపుగా 12 సంవత్సరాల తర్వాత మహేష్ త్రివిక్రమ్ కలిసి ఒకే సినిమాకు పని చేస్తుండటంతో అభిమానులు తెగ సంతోషిస్తున్నారు.

ఈ సినిమాకు సంబంధించి వేర్వేరు టైటిల్స్ ప్రచారంలోకి వస్తున్నా మేకర్స్ మాత్రం ఆ టైటిల్స్ గురించి స్పందించడం లేదు. మహేష్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus