Mahesh Babu: సెల్ఫ్ ఐసోలేషన్లో మహేష్ బాబు.. ఆగిపోయిన ‘సర్కారు వారి’ షూటింగ్..!

క‌రోనా తగ్గుముఖం పడుతుంది, టాలీవుడ్ ఇండస్ట్రీ మెల్ల మెల్లగా కోలుకుంటుంది అని సంతోషించేలోపు.. మళ్ళీ కరోనా విజృంభిస్తుండటం.. ప్రతీ ఒక్కరినీ నిద్ర లేకుండా చేస్తుంది. దీని దెబ్బకి మళ్ళీ థియేట‌ర్లు మూత ప‌డ్డాయి. చాలా సినిమాల షూటింగ్లు కూడా వాయిదా పడ్డాయి.అంతేకాకుండా వరుసగా టాలీవుడ్ సెలబ్రిటీలు క‌రోనా బారిన పడుతుండడం గమనించాల్సిన విషయం. ఈ మధ్యనే ప‌వన్ క‌ల్యాణ్ కూడా కరోనా భారిన పడ్డారు. 4 రోజులకే అతను కోలుకున్నాడు లెండి. అయితే తాజాగా మహేష్ బాబు కూడా క్వారెంటైన్ కు వెళ్లారని వార్తలు వస్తుండడంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

ప్రస్తుతం మహేష్ బాబు ఐసోలేషన్ లో ఉన్నారట. వివరాల్లోకి వెళితే.. ఆయన ‘స‌ర్కారు వారి పాట’ సినిమాలో న‌టిస్తున్న సంగ‌తి అందరికీ తెలిసిందే. ఈ మధ్యనే రెండో షెడ్యూల్ కూడా ప్రారంభం అయ్యింది. అయితే అనుకోని విధంగా మ‌హేష్ బాబు ప‌ర్స‌న‌ల్ స్టైలిస్ట్ కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింద‌ట‌. అది మాత్రమే కాదు ‘స‌ర్కారు వారి పాట’ మూవీ టీం లో మరో న‌లుగురు టెక్నీషియ‌న్స్ కు కూడా క‌రోనా సోకిందట. దీంతో ముందు జాగ్రత్తగా మహేష్ బాబుని ఐసోలేష‌న్లో ఉండమని సూచించారట డాక్టర్లు.

తన ఫ్యామిలీని కూడా దృష్టిలో పెట్టుకుని ఐసోలేషన్ లో ఉండడమే మంచిది అని మహేష్ బాబు డిసైడ్ అయ్యాడట.3 రోజులుగా మహేష్ ఐసోలేషన్ లోనే ఉన్నాడట.ఇదిలా ఉండగా.. మే వరకూ ‘స‌ర్కారు వారి పాట’ షూటింగ్ మొదలయ్యే అవకాశం లేదని తెలుస్తుంది. ఒకవేళ మొదలైనా 50మంది క్రూతోనే షూటింగ్ ను నిర్వహించాలి.

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus