Mahesh Babu, Krishna: కృష్ణ గారికి ఏమీ కాలేదంటున్నారు.. మరి ఇదేంటి..?

సూపర్ స్టార్ కృష్ణ గారు తీవ్ర అనారోగ్యం పాలయ్యారు అంటూ ఉదయం నుండి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. శ్వాస సంబంధిత ఇబ్బందితో ఆయన హాస్పిటల్ లో చేరినట్టు కొంతమంది చెబుతుంటే మరికొంత మంది స్వల్ప గుండెపోటు వచ్చినట్టు మరి కొంతమంది చెబుతున్నారు.అయితే కృష్ణ గారి టీం అయితే ఆయన రెగ్యులర్ చెకప్ కు మాత్రమే వెళ్లినట్టు చెబుతున్నారు. నిజంగా ఆయన రెగ్యులర్ చెకప్ కు మాత్రమే వెళ్తే..

ఆయన కుటుంబ సభ్యులు అంతా హాస్పిటల్ కి ఎందుకు వెళ్తున్నట్టు అనేది అంతు చిక్కని ప్రశ్న.సీనియర్ నటుడు నరేష్, కృష్ణ గారు ఒకే ఇంట్లో ఉంటారు కాబట్టి ఆయన వెళ్లారు అంటే అర్థం ఉంది. కానీ కృష్ణగారికి ఏమీ కాలేదు.. ఆయన రెగ్యులర్ చెకప్ అయిన వెంటనే డిశ్చార్జ్ చేస్తాం అని తెలిపినప్పటికీ కృష్ణ గారి కుటుంబ సభ్యులు ఎందుకు హాస్పిటల్ కి వెళ్తున్నట్టు అనే అనుమానాలు కూడా అందరిలోనూ ఉన్నాయి.

కృష్ణ గారి కూతుర్లు, అల్లుళ్ళు ఆల్రెడీ అక్కడే ఉన్నారు అని ఇన్సైడ్ సర్కిల్స్ సమాచారం. అంతేకాదు తాజాగా మహేష్ బాబు కూడా గచ్చిబౌలిలో ఉన్న కాంటినెంటల్ హాస్పిటల్ కు చేరుకున్నట్టు వినికిడి. నమ్రత ఆల్రెడీ అక్కడే ఉన్నారు. దీంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. ఈరోజు సాయంత్రానికి ఆయన్ని డిశ్చార్జి చేస్తామని వైద్యులు తెలిపినా.. ఆందోళనకరమైన వాతావరణమే నెలకొంది అని చెప్పాలి.

ప్రస్తుతం కృష్ణ గారి వయసు 80 సంవత్సరాలు అన్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే ఆయన సతీమణి ఇందిరా గారు మరణించడంతో ఆయన మానసికంగా కృంగిపోయినట్టు వినికిడి. ఆయన ఆరోగ్యంపై ఫుల్ క్లారిటీ రావాలి అంటే మరికొన్ని గంటలు ఎదురుచూడక తప్పదు అనే చెప్పాలి.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus