టాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా దూసుకుపోతున్నాడు థమన్. వరుస సక్సెస్ లతో తన కెరీర్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ ఏడాది ‘అల వైకుంఠపురములో’ సినిమా థమన్ రేంజ్ ని అమాంతం పెంచేసింది. దీంతో భారీ బడ్జెట్ చిత్రాల్లో థమన్ ని ఏరికోరి మరీ తీసుకుంటున్నారు. చాలా కాలం తరువాత మహేష్ బాబు సినిమా కూడా థమన్ దగ్గరకే వచ్చింది. పరశురామ్ దర్శకత్వంలో మహేష్ హీరోగా నటిస్తోన్న ‘సర్కారు వారి పాట’ సినిమా కోసం థమన్ ఇప్పటికే మూడు ట్యూన్ లను అందించినట్లు తెలుస్తోంది.
అయితే ఈ మధ్యలో ఓ సంఘటన చోటుచేసుకుందట. దర్శకుడు పరశురామ్ కి సంగీత దర్శకుడు గోపీ సుందర్ అంటే అభిమానం. తనకు భారీ హిట్ ఇచ్చిన ‘గీత గోవిందం’ సినిమాకి గోపిసుందర్ మ్యూజిక్ బాగా ప్లస్ అయింది. దీంతో తన సినిమాలకు గోపి సుందర్ తో పని చేయించుకోవాలని పరశురామ్ భావిస్తున్నాడు. థమన్ కూడా కరోనా కారణంగా చెన్నై వదిలి రావడం లేదు. దీంతో ఇదే ఛాన్స్ అనుకొని.. గోపిసుందర్ చేత రెండు శాంపిల్ ట్యూన్స్ చేయించి.. మహేష్ దగ్గరకు వెళ్లి వినిపించాడట పరశురామ్. కానీ మహేష్ బాబు థమన్ నే మ్యూజిక్ డైరెక్టర్ గా కంటిన్యూ చేయాలని..
ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి సౌండింగ్ నాలెడ్జ్ ఉన్నది థమన్ కే అంటూ నిర్మొహమాటంగా చెప్పేశాడట మహేష్. దీంతో చేసేదేం లేక పరశురామ్ స్వయంగా తన అసిస్టెంట్ డైరెక్టర్ తో కలిసి చెన్నై వెళ్లి థమన్ తో మూడు ట్యూన్ లు చేయించుకొని వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ జనవరి నుండి జరగనుంది. దీనికోసం చిత్రబృందం అమెరికా పయనమవనున్నారు. అమెరికా షెడ్యూల్ పూర్తయిన తర్వాత మిగిలిన భాగాన్ని ఇండియాలో పూర్తి చేయనున్నారు. బ్యాంక్ స్కామ్‌ల ఆధారంగా ఈ సినిమా ఉంటుందని సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీయంబీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా కనిపించనున్నారు.