రాజమౌళి సినిమా కోసం తొలిసారి మహేష్‌ అలా

మహేష్‌బాబు అంటే అభిమానులు, ప్రేక్షకుల మైండ్‌లో ఓ లుక్‌ ఫిక్స్‌ అయిపోయి ఉంటుంది. అయితే నీట్‌ క్రాఫ్‌తో, గెడ్డం లేకుండా కనిపిస్తాడు. లేదంటే చిన్నపాటి గెడ్డం, మీసంతో రఫ్‌ లుక్‌లో కనిపిస్తాడు. అలాంటి మహేష్‌ను ఆరు అంగుళాల గెడ్డంతో కనిపిస్తే… సూపర్‌ మేకోవర్‌ కదా. ఇప్పుడు మహేష్‌ కొత్త సినిమా గురించే ఈ విషయమే రూమర్‌గా వినిపిస్తోంది. అయితే ఈ లుక్‌లో మహేష్‌ను చూడాలంటే ఇంకొంచెం టైమ్‌ పడుతుంది… అయితే న్యూస్‌ అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తోంది.

మహేష్‌ – రాజమౌళి కాంబినేషన్‌లో ఓ సినిమా ఉంటుందని చాలా రోజుల నుండి వార్తలొస్తున్నాయి. నిర్మాత కూడా ఫిక్స్‌ అయిపోయారు. అయితే వివిధ కారణాల రీత్యా సినిమా ఆలస్యమవుతూ వచ్చింది. అయితే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత రాజమౌళి నెక్స్ట్‌ మహేష్‌తోనే అని వార్తలొస్తున్నాయి. పరిస్థితులు చూస్తుంటే అదే కరెక్ట్‌ అయ్యేలా ఉంది. ఈలోగా విజయేంద్ర ప్రసాద్‌ కూడా ఓ కథ సిద్ధం చేసేశారట. ప్రస్తుతం దానికి అదనపు హంగులు అద్దుతున్నారట. ఈ సమయంలోనే గడ్డం పాయింట్‌ వచ్చిందట.

విషయం ఏంటంటే.. ఛత్రపతి శివాజీ జీవితం ఆధారంగా తీసుకొని మహేష్‌ కోసం కథ సిద్ధం చేశారట. మరి శివాజీ సినిమా అంటే గెడ్డం ఉండాల్సిందే. అందులోనూ శివాజీ గుబురు గెడ్డం ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీంతో మహేష్‌ను అలా గెడ్డంతో చూస్తామని వార్తలొస్తున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే మహేష్‌ను ఫుల్‌ ట్రాన్స్‌ఫామ్‌లో చూడొచ్చు. త్వరగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వచ్చేసి… ‘సర్కారు వారి పాట’ పాడేసి ఇద్దరూ కలసి కొత్త సినిమా మొదలుపెడితే బాగుంటుంది కదా.

Most Recommended Video

చావు కబురు చల్లగా సినిమా రివ్యూ & రేటింగ్!
మోసగాళ్ళు సినిమా రివ్యూ & రేటింగ్!
శశి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus