Sitara: మహేష్ కూతురు సితార రికార్డ్ సృష్టించింది.. ఎలా అంటే?

  • May 26, 2023 / 06:24 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని గురించి అందరకీ సుపరిచితమే. సోషల్ మీడియాలో నిత్యం యాక్టీవ్ గా ఉంటూ ..తన లేటెస్ట్ ఫొటోలు, డాన్స్ వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది ఈ బ్యూటీ. అంతేకాదు ఈమెకు సోషల్ మీడియాలో బోలెడన్ని ఫ్యాన్ పేజీలు కూడా ఉన్నాయి. సితారకి సంబంధించిన అప్డేట్ ఏమి వచ్చినా… ఆ ఫ్యాన్ పేజీల ద్వారా సితార కు సంబంధించిన ఎటువంటి వార్తలు వచ్చినా వైరల్ అయిపోతూ ఉంటాయి.

ఇక సితార (Sitara) ఇన్స్టాగ్రామ్ ఖాతాకి 12 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. దర్శకుడు వంశీ పైడిపల్లి కూతురు ఆద్యతో కలిసి ఈమె సొంతంగా ఓ యూట్యూబ్ చానల్ కూడా మెయింటైన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా..చిన్న వయసులోనే ఎవ్వరూ ఊహించని విధంగా ఓ బడా ప్రాజెక్టులో ఛాన్స్ కొట్టేసి రికార్డ్ కొట్టింది. వివరాల్లోకి వెళితే.. సితారకి సోషల్ మీడియాలో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఆధారం చేసుకుని ఓ ప్రముఖ జ్యువెలరీ సంస్థ..

తమ బ్రాండ్ కు ప్రచారకర్తగా ఈమెను ఎంపిక చేసుకుంది. అందుకోసం సితారకు పెద్ద మొత్తంలో పారితోషికం ఆఫర్ చేసినట్టు సమాచారం. ఇంకో విశేషం ఏంటంటే.. సితార ఆల్రెడీ ఈ బ్రాండ్ కు సంబంధించిన యాడ్ ను మూడు రోజుల్లోనే కంప్లీట్ చేసిందట. అతి చిన్న వయసులోనే సితార తమ తల్లిదండ్రులు అయిన మహేష్, నమ్రత.. లు గర్వపడేలా చేస్తుందని చెప్పాలి. ప్రస్తుతం సితార యాడ్ కు సంబంధించిన ఫోటోలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus